Plane Landing Gear: టైర్ల పక్కన దాక్కొని రెండున్నర గంటల పాటు విమానయానం

మియామి నగరానికి 1640కిలోమీటర్ల దూరంలో ఉంది గ్వాటెమాలా సిటీ. అత్యంత వేగంగా వెళ్లాలనుకుంటే ఉండే ఏకైక మార్గం విమాన ప్రయాణం. రెండున్నర గంటల సమయంలో సేఫ్టీగా..

Plane Landing Gear: మియామి నగరానికి 1640కిలోమీటర్ల దూరంలో ఉంది గ్వాటెమాలా సిటీ. అత్యంత వేగంగా వెళ్లాలనుకుంటే ఉండే ఏకైక మార్గం విమాన ప్రయాణం. రెండున్నర గంటల సమయంలో సేఫ్టీగా చేరుకోవచ్చు కూడా. అలాగే గాల్లో ప్రయాణించిన ఒక వ్యక్తి.. మియామి చేరుకున్నాడు కానీ, అందరిలా ప్రయాణికుల సీట్లలో కూర్చొని కాదు. శనివారం ఉదయం ఓ ఫ్లైట్‌ కింద ఉండే ల్యాండింగ్​ గేర్​ నుంచి బయటకు దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

అమెరికన్​ ఎయిర్​లైన్స్​ విమానంలో వెళ్లాలంటే రెండున్నర గంటల సమయం పడుతుంది. ఈ ప్రయాణ సమయం మొత్తం విమానం టైర్ల పక్కనే ఉండే ల్యాండింగ్‌ గేర్‌లలోనే దాక్కొన్నాడు. కిందకు దిగాక అతనికి సంబంధించిన దృశ్యాలను స్థానిక సిబ్బంది వీడియో తీశారు.

ఈ వీడియోను స్థానిక వార్తాసంస్థ ఇన్‌స్టాగ్రామ్​ ఖాతాలో పోస్ట్​ చేసింది. ఈ మొత్తం ఘటనలో ఆ వ్యక్తి ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. ఈ వ్యవహారంపై వీడియో తీసిన విమానాశ్రయ సిబ్బంది స్పందించలేదు. అతణ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని అధికారులు వెల్లడించారు.

………………………………… : ప్రాణాలు రక్షించే వారికే రక్షణ లేదు..!

అమెరికాకు దక్షిణాన ఉండే గ్యాటెమాలా దేశం నుంచి కొంతకాలంగా అమెరికాకు వలస వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగిపోయింది.

 

 

ట్రెండింగ్ వార్తలు