Life Guards : ప్రాణాలు రక్షించే వారికే రక్షణ లేదు..!

లైఫ్‌ గార్డ్స్‌.. బీచ్‌లలో పర్యాటకుల ప్రాణరక్షణ కోసం ఏర్పాటు చేసిన గజ ఈతగాళ్లు. సముద్రపు అలల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రాణ రక్షకులు. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారు.

Life Guards : ప్రాణాలు రక్షించే వారికే రక్షణ లేదు..!

Life Guards

Troubles for the life guards : లైఫ్‌ గార్డ్స్‌.. బీచ్‌లలో పర్యాటకుల ప్రాణరక్షణ కోసం ఏర్పాటు చేసిన గజ ఈతగాళ్లు. సముద్రపు అలల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రాణ రక్షకులు. అటువంటి లైఫ్‌ గార్డ్స్‌ సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారు. సముద్రంలో దిగేందుకు లైఫ్‌ జాకెట్లు, కెరటాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు లైఫ్‌ బోట్లు లేక అవస్థలు పడుతున్నారు. సాగర నగరం విశాఖపట్నం పర్యాటకుల స్వర్గధామం. అందమైన బీచ్‌లు, ప్రకృతి రమణీ సౌందర్యాలు ఈ నగరం సొంతం. తెలుగు రాష్ట్రాల నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.

ఆర్కే బీచ్‌తో పాటు, రుషికొండ, తిన్నెల పార్క్‌, భీమిలి బీచ్‌లను సందర్శిస్తుంటారు. సముద్రపు అలల్లో తేలియాడుతూ ఆహ్లాదంగా స్నానాలు చేస్తుంటారు. ఉధృతంగా ఎగిసిపడే సముద్ర కెరటాలు ప్రమాదకరమన్న విషయాన్ని మర్చిపోతుంటారు. రాకాసి అలల ఉధృతికి ప్రాణాలు పోగొట్టుకున్న పర్యాటకులు ఉన్నారు. ఏటా పదుల సంఖ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నట్టు అధికార గణాంకాలు చెబుతున్నాయి. ప్రమాదాలు చోటుచేసుకున్న కొన్ని సందర్భాల్లో లైఫ్‌గార్డ్స్‌, పోలీసులు ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. అలాంటి గజ ఈతగాళ్లు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Sameer Sharma : ఏపీ సీఎస్ సమీర్‌ శర్మ పదివీ కాలం పొడిగింపు

విశాఖ సముద్రతీర ప్రాంతం 32 కిలోమీటర్ల పరిధిలో పలు బీచ్‌లు ఉన్నాయి. కెరాటాలు చాలా ఉధృతంగా ఉంటాయి. రాకాసి అలలకు కొందరిని మింగేస్తున్నాయి. అయిన వారిని పోగొట్టుకున్న కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయి. తమ వారి జ్ఞాపనాలకు తలచుకుని కుమిలిపోతూ.. మాసికంగా కుంగిపోతున్నాయి. దీంతో బీచ్‌ల్లో ప్రమాదాల నియంత్రణ కోసం జీవీఎంసీ 38 మంది గజ ఈతగాళ్లను నియమించింది. వారంతా సుముద్ర తీరంలో గస్తీ తిరుగుతూ లైఫ్ గార్డ్స్ గా సేవలు అందిస్తున్నారు.

కొందరు పర్యాటకులు అత్యుత్సాహంతో సముద్రం లోపలకు వెళ్లి స్నానాలు చేస్తూ కెరటాల్లో చిక్కుకుని, ఉక్కిరిబిక్కిరి అవుతున్న వారిని లైఫ్‌గార్డ్స్‌ గమనించి అప్రమత్తమై..ప్రాణాలు కాపాడుతున్నారు. ఇప్పటివరకు సుమారు 500 మందిని ఈ లైఫ్ గార్డ్స్ రక్షించారు. అలాంటి గజ ఈతగాళ్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Dollar Seshadri: గుండెపోటుతో ‘డాలర్’ శేషాద్రి కన్నుమూత

సముద్ర కెరాటాల్లో చిక్కుకున్న పర్యాటకులను ప్రాణాలకు తెగించి కాపాడుతున్న తమకు జీవీఎంసీ సరైన పరికరాలు అందిండంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లైఫ్‌ జాకెట్లు, లైఫ్‌ బోట్లు ఇవ్వలేదంటున్నారు. పర్యాటకులు సముద్రంలో మధ్యలోకి వెళ్లకుండా వారించేందుకు మైక్‌ సెట్‌ కూడా ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లైఫ్‌ గార్డ్స్‌కు ఇచ్చే జీతాలు అరకొర. అవి కూడా సలకాంలో ఇవ్వరు. ఆపై కోతల వాతలు. ప్రాణాలకు తెగించి పర్యాటకులను కాపాడుతున్న తమను జీవీఎంసీ చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమస్యలు పరిష్కరించమని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజం లేకుండా పోయిందని లైఫ్‌ గార్డ్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులు స్పందించిన ఇకపైనా తమ సమస్యలను పరిష్కరించి, అవసరమైన పరికరాలను సమకూర్చాలని కోరుతున్నారు. లైఫ్‌ జాకెట్లు, లైఫ్‌ బోట్లు అందిస్తే ఇంకా సమర్థవంతంగా సేవలు చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.