Man Tries To Be Simulate Pregnancy For A Day
simulate pregnancy for a day : మహిళల జీవితంలో ప్రెగ్నెన్సీ అనేది ఒక అద్భుతమైన క్షణం.. అలాంటి క్షణాన్ని అనుభూతి చెందేందుకు ప్రతి మహిళా ఆరాటపడుతుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిది నెలల పాటు కడుపులో శిశువును మోస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో శారీరకంగా, మానసికపరంగా అనేక సవాళ్లు ఎదరవుతుంటాయి. మానసిక ఒత్తిడిని సైతం అధిగమిస్తారు.
ప్రసవ వేదనతో పాటు నెలలు నిండేవరకు బిడ్డను మోస్తూ అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఆ బాధ మహిళలకు మాత్రమే తెలుస్తుంది. అసలు మహిళలు గర్భం దాల్చిన సమయంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారో ప్రయత్నపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేశాడో టిక్ టాకర్.. కానీ, ఒక రోజూ కూడా పూర్తిగా గర్భిణీలా ఉండలేకపోయాడు. మెయిట్ లాండ్ హాన్లీ అనే వ్యక్తి.. పాపులర్ టిక్ టాకర్.. గర్భిణీలా నటిస్తూ వీడియో చేశాడు.
తన పొట్టపై వాటర్ మిలన్ సెట్ చేశాడు. అలాగే ఛాతిపై చిన్నపాటి వాటర్ మిలాన్ లను ఉంచుకున్నాడు. నిండు గర్భిణాల బెడ్ పై పడుకుని హాన్లీ అలానే ఉన్నాడు. కానీ, అలా పడుకున్న వ్యక్తి లేచి నిలబడ లేకపోయాడు. తన శరీర బరువును మించడంతో అతడు లేవలేకపోయాడు.
గర్భిణీలా నటించడం అంత సులభం కాదనే విషయం తెలుసుకున్నాడు. బెడ్‌పై నుంచి కిందికి దిగలేక ఇబ్బంది పడ్డాడు. సో.. మహిళల్లా ఉండటం చాలా కష్టమని తెలుసుకున్నాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రూ.కోటి 70 లక్షల మంది చూశారు. వైరల్ అవుతున్న వీడియో ఇదే..