Guinness World Record
Guinness World Record : ప్రపచంలో అనేకమంది వ్యక్తులు తమ పేర్లు రికార్డుల్లో నమోదు చేసుకోవాలని కొన్ని పిచ్చి పనులు చేస్తుంటారు. వాటి వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కొందరైతే పులిని చూసి నక్క వాత పెట్టుకుందన్న తంతుగా ఇతరుల రికార్డులను బ్రేక్ చేయాలని ప్రయత్నం చేసి కూడా ఇబ్బందుల పాలవుతుంటారు. నైజీరియాలో ఓ వ్యక్తి సాధించిన రికార్డును బద్దలు కొట్టాలనే ఆశతో ఓ వ్యక్తి ఏడు రోజులు ఆపకుండా ఏడ్చాడు. ఫలితంగా కంటిచూపును కోల్పోయాడు.
టెంబు ఎబెరే అనే వ్యక్తి ఏడ్వడంలో ప్రపంచ రికార్డు సాధించాలని నాన్ స్టాప్‌గా 7 రోజులు ఏడ్చి తన కంటి చూపును కోల్పోయాడు. కంటి చూపును కోల్పోవడానికి ముందు తలనొప్పి, ముఖం వాపు, కళ్లు ఉబ్బిపోయి బాధపడ్డాడట. అతను గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారు పరిగణనలోకి తీసుకోలేదట.
టెంబు ఎబెరే మాత్రమే కాదు చాలామంది నైజీరియన్లు పలు రికార్డులు బద్దలు కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 26 చాలా మంది నైజీరియన్లు రికార్డులను బద్దలు కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారట. మేలో హిల్డా బాసి అనే చెఫ్ 100 గంటల పాటు నైజీరియన్ వంటకాలను వండటానికి ప్రయత్నించారు. 26 ఏళ్ల వ్యక్తి 93 గంటల 11 నిమిషాల పాట వంట చేసి 2019 లో భారతదేశంలో ఉన్న వంట మారథాన్ రికార్డును బద్దలు కొట్టాడు. అయితే తాజాగా కంటిచూపును పోగొట్టుకున్న వ్యక్తిని ఉద్దేశించి గిన్నిస్ వరల్డ్ యాజమాన్యం ఇలాంటి వెర్రి ప్రయత్నాలు చేయవద్దని నైజీరియన్లను కోరిందట.