Man Prank Viral : చనిపోయినట్లు నమ్మించాడు.. అంత్యక్రియలకు రప్పించాడు.. కుటుంబ సభ్యులకు ప్రాంక్‌తో గుణపాఠం నేర్పిన వ్యక్తి

ఇటీవల కాలంలో మనుష్యుల మధ్య అనుబంధాలు కరువైపోతున్నాయి. తనని తన కుటుంబం పట్టించుకోవడం లేదని ఓ వ్యక్తి తను చనిపోయినట్లు కుటుంబ సభ్యుల్ని నమ్మించాడు. అంత్యక్రియలకు రప్పించాడు. ఆ తరువాత ఏమైంది? అతను చేసిన ప్రాంక్ కుటుంబ సభ్యుల్లో మార్పు తీసుకువచ్చిందా?

Man Prank Viral

Man Prank Viral : బ్రతికుండగా మనుష్యుల మధ్య అనుబంధాలు కరువైపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో తన కుటుంబాన్ని గుణపాఠం నేర్పాలనుకున్నాడు ఓ వ్యక్తి. తను చనిపోయినట్లు నమ్మించి అంత్యక్రియలు ఏర్పాటు చేయించాడు. అతని కుటుంబ సభ్యులంతా అక్కడికి వచ్చారు.. ఆ తరువాత ఏమైంది? చదవండి.

Prank went wrong : ప్రాంక్ కాస్తా తుస్సుమంది.. పెళ్లికొడుకు పీకుడికి బావమరిదికి చుక్కలు కనిపించాయి..

45 సంవత్సరాల డేవిడ్ బేర్టెన్ తను చనిపోయినట్లు నాటకం ఆడి కుటుంబాన్ని అంత్యక్రియల కోసం రప్పించాడు. అందుకోసం అతని కుమార్తెలతో పాటు పక్కా ప్రణాళికను రచించాడు. డేవిడ్ కుటుంబం లీజ్ సమీపంలో అంత్యక్రియలను ఏర్పాట్లు చేసింది. ఇక అతని కుటుంబసభ్యులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. డేవిడ్ అందర్నీ షాక్‌కి గురి చేస్తూ హెలికాప్టర్ నుంచి దిగాడు. అతడిని చూడగానే అప్పటివరకూ కన్నీరు పెట్టుకున్న వారంతా ఉలిక్కిపడ్డారు. కొందరు పరుగున వచ్చి అతడిని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చారు.

Marriage prank video : స్నేహితుల ప్రాంక్‌తో పరేషాన్ అయిన కొత్త జంట.. వీడియో వైరల్

డేవిడ్‌ను మీరెందుకు ఇలా ప్రాంక్ చేశారని అడిగితే ‘తన కుటుంబం తనను ఏనాడు పట్టించుకోలేదని ఆ విషయంలో తనకి చాలా బాధ ఉందని చెప్పాడు. కుటుంబ సభ్యులంతా విడిపోయామని తనని దేనికి ఆహ్వానించరని.. ఎవరూ చూడటానికి కూడా రారని అందుకే వారు చేస్తున్న తప్పు తెలియచేయాలని ప్రాంక్ చేసినట్లు’ చెప్పుకొచ్చాడు. ఇక డేవిడ్ స్టంట్‌కి సంబంధించిన పూర్తి వీడియో అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడలేదు. అతని కుటుంబ సభ్యుల్లో మాత్రం ఈ ప్రాంక్ ఖచ్చితంగా మార్పు తీసుకువచ్చి ఉండాలి.