Marriage prank video : స్నేహితుల ప్రాంక్‌తో పరేషాన్ అయిన కొత్త జంట.. వీడియో వైరల్
పెళ్లికి ముందు ఫోటో షూట్ లు, పెళ్లిళ్లలో రీల్స్ ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఇక వధూవరుల తరపు ఫ్రెండ్స్ చేసే సందడి కామనే. తాజాగా ఓ పెళ్లికొడుకు ఫ్రెండ్స్ చేసిన ప్రాంక్ ఘోరంగా ఫెయిలై ఆ కొత్త జంటకు ట్రబుల్ ఇచ్చింది. కాసేపు ఆ వేడుకలో వాతావరణం గంభీరంగా మారిపోయింది.

Marriage prank video
Marriage prank video : ఒకప్పుడు పెళ్లంటే (marriage) పందిళ్లు, మేళతాళాలు, బంధువుల హడావిడితో జరిగేవి.. ఇప్పుడు సీన్ రివర్స్. పెళ్లికి ముందు నుండి ఫోటో షూట్‌లు, పెళ్లయ్యే వరకు రకరకాల కాన్సెప్ట్‌లతో వధూవరులపై వీడియోలు చాలా హంగామా నడుస్తోంది. ఆ తరువాత అవన్నీ సోషల్ మీడియాలో షేర్ చేయడం.. వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం. ఈ పెళ్లిళ్లలో జరిగే కొన్ని ఫన్నీ సంఘటనలు కూడా ఈ మధ్య కాలంలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ పెళ్లిలో పెళ్లికొడుకు ఫ్రెండ్స్ (prank) చేసిన ప్రాంక్ ఘోరంగా ఫెయిలై కొత్త జంటకు ట్రబుల్ ఇచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ వైపు ఎంతో సందడిగా పెళ్లి జరుగుతోంది. బంధువులంతా ఆ సంబరాన్ని వీక్షిస్తున్నారు. సరిగ్గా వారి జీవితాలు ముడిపడే సమయం ఆసన్నమైంది. వధూవరులిద్దరూ దండలు మార్చుకున్నారు. పెళ్లికూతురి (bride) మెడలో వేసిన వరమాలను పెళ్లికొడుకు (bridegroom)సరిచేస్తున్నాడు. ఆ మూమెంట్‌లోనే పెళ్లికొడుకు ఫ్రెండ్స్ తాము అనుకున్నది అమలు చేశారు. ఒక్కసారిగా గాల్లో ఏదో పేలినట్లు పెద్ద శబ్దం వినిపించింది. పెళ్లికొడుకు హడలిపోయాడు. పెళ్లికూతురు ఆ శబ్దానికి బిత్తరపోయింది. అక్కడ ఉన్నవారంతా ఎవరో గన్ పేల్చారు అనుకున్నారు. సీన్ కట్ చేస్తే స్నేహితులు టపాకాయ (Firecracker) పేల్చారని అర్ధమై పెళ్లికొడుకు వారిపై చిరాకు పడ్డాడు. సీన్ అర్ధమైన అక్కడి వారంతా ఊపిరి పీల్చుకుని నవ్వుకున్నారు.
Sweet Dabeli : దబేలీ స్వీట్ కొత్త వెర్షన్.. విచిత్రంగా తయారు చేసిన వ్యక్తి వీడియో వైరల్
ఏది ఏమైనా సందడిగా ఉన్న వాతావరణం కాస్తా కాసేపు స్నేహితులు చేసిన ప్రాంక్ తో గంభీరంగా మారిపోయింది. సరదాగా వారు చేసిన ప్రాంక్ కాస్తా డిజాస్టర్‌గా (Disaster) మారింది. ఈ ప్రాంక్ ఇప్పుడు _naughtyfamily ఇన్‌స్టా అకౌంట్ నుంచి షేరై వైరల్ గా మారింది.
View this post on Instagram