Magic Trick : షుగర్ సాచెట్‌‌తో మ్యాజిక్.. అబ్బురపరుస్తున్న వీడియో

షుగర్ సాచెట్ తో ఓ వ్యక్తి చేసిన మ్యాజిక్ అబ్బురపరుస్తోంది. ఎలా సాధ్యమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ క్లిప్ ను @jadon.ray యూజర్ టిక్ టాక్ లో షేర్...

Sugar Packets

Man’s Magic Trick With Sugar Sachet : మ్యాజిక్. కళ్లకు కనికట్టు చేయడమే మ్యాజిక్. మనుషులు చేసే ఈ మ్యాజిక్ అంటే పిల్లలనే కాదు పెద్దవాళ్లు సైతం అలరిస్తుంది. కన్నమూసి తెరిచేంతలో చేసే మ్యాజిక్ ట్రిక్స్ చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. ఇలాంటి మ్యాజిక్ షోలకు మంచి ఆదరణే ఉంటుంది. మ్యాజిక్ లోఉన్న ఆ మ్యాజిక్ మజానే వేరని కొందరంటుంటారు. ఇంద్రజాలికులు కనికట్టు చేస్తూ… మన కళ్లను మాయ చేస్తూ.. నమ్మలేని విధంగా చేస్తారు. టోపీలో రిబ్బన్ వేసి మాయం చేస్తారు. మనిషిని పడుకోబెట్టి అందరూ చూస్తుండగానే సగం చేస్తారు. ఇదంతా నిజం కాదని తెలుసు. కానీ నిజమే అనిపించేలా వారు చేసే మ్యాజిక్ లకు ఎంతో మంది ఫిదా అయిపోతుంటారు.

Read More : Maharashtra I-T Raids : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సోదాలు ఎందుకు లేవు ?

షుగర్ సాచెట్ తో ఓ వ్యక్తి చేసిన మ్యాజిక్ అబ్బురపరుస్తోంది. ఎలా సాధ్యమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ క్లిప్ ను @jadon.ray యూజర్ టిక్ టాక్ లో షేర్ చేశారు. ఓ వ్యక్తి షుగర్ సాచెట్ ను తెరిచాడు. కొద్దిగా మూసుకున్న ఎడమ చేతిలో షుగర్ ను పోసుకున్నాడు. ఖాళీ సాచెట్ ను నోట్లో పెట్టుకున్నాడు. ఠక్కున గాల్లోకి విసిరేశాడు. ఆ షుగర్ ఎక్కడుందో ఎవరికీ అర్థం కాలేదు. గాల్లోకి విసిరేస్తే.. కింద పడాలి కదా.. కానీ అలా జరగలేదు.

Read More : Ukraine President Zelenskyy : కమెడియన్‌ కాదు.. ఖతర్నాక్‌ జెలెన్‌స్కీ

అనంతరం మరో చేత్తో రా.. రా అంటూ సైగలు చేశాడు. ఆ సాచెట్ ను తెరిచాడు. తర్వాత.. కుడి చేతిలో నుంచి షుగర్ ను ఆ సాచెట్ లో పోశాడు. సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ గా మారింది. ఎంతో మంది దీనిని వీక్షించారు. అసలు ఎలా సాధ్యమైందని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికీ తాను 57 సార్లు వీడియో చూడడం జరిగిందని ఓ నెటిజన్ వెల్లడించాడు. అది ఎలా సాధ్యమో అతనే చెప్పాలంటున్నారు.