Maharashtra I-T Raids : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సోదాలు ఎందుకు లేవు ?

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో ఇక్కడ జరుగనున్నాయని, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ లలో మాత్రమే కేంద్ర ఏజెన్సీలు పని చేస్తాయని విమర్శించారు. భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల్లో...

Maharashtra I-T Raids : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సోదాలు ఎందుకు లేవు ?

Sanjayraut

Sanjay raut attacks modi govt : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీకి చెందిన నేతలపై కేంద్ర ఏజెన్సీ దాడులకు పాల్పడుతోందని శివసేన ఎంపీ సంజయ్ రనౌత్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. మహారాష్ట్రలోని MVA (మహా వికాస్ అఘాడీ) ప్రభుత్వ నేతలపై రాజకీయ ప్రతికారం తీర్చుకుంటున్నారని విమర్శించారు. ఆదాయపు పన్ను శాఖ దాడులపై కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన ఆదివారం విమర్శలు గుప్పించారు. ఆదాయం, పన్ను మహారాష్ట్రలో ఉందని తాను భావిస్తున్నట్లు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆదాయం, పన్ను లేదని ఎద్దేవా చేశారు.

Read More : JP Nadda: హ్యాకింగ్‌కి గురైన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్!

మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో ఇక్కడ జరుగనున్నాయని, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ లలో మాత్రమే కేంద్ర ఏజెన్సీలు పని చేస్తాయని విమర్శించారు. భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల్లో అంతా బాగానే ఉందా ? అని ప్రశ్నించారు. తాము ఈ విషయాలన్నింటినీ గమనిస్తున్నట్లు, ప్రజలు కూడా చూస్తున్నారన్నారు. యూపీలో జరుగుతున్న ఎన్నికలపై కూడా ఆయన స్పందించారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదనే విశ్వాసం వ్యక్తం చేశారాయన.

Read More : India : 240మంది భారతీయులతో బుడాపెస్ట్‌ నుంచి ఇండియా చేరుకున్న మూడో విమానం

యూపీలో మార్పు వస్తుందని ఆదిత్య ఠాక్రే భావిస్తున్నారని, ప్రజలు తమ మనస్సులు మార్చుకొనే దానిలో ఉన్నారన్నారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ముంబైలోని శివసేన కార్పొరేటర్ యశ్వంత్ జాదవ్ నివాసంలో శుక్రవారం ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. అదే సమయంలో BMC స్టాండింగ్ కమిటీ ఛైర్ పర్సన్ గా ఉన్న జాదవ్ ప్రాంగణంలో ఐటీ దాడులు మూడో రోజు కొనసాగుతోంది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు I-T సోదాలు జరిగాయి.