యుక్రెయిన్‌లో మోదీ, జెలెన్‌స్కీ చ‌ర్చ‌లు జ‌రిపిన మారిన్స్కీ ప్యాలెస్‌కు.. నాటునాటు సాంగ్‌కు సంబంధం ఏమిటో తెలుసా?

యుక్రెయిన్ లోని మారిన్స్కీ ప్యాలెస్.. గతంలో పెద్దగా పరిచయం లేని ఈ ప్యాలెస్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాఫిక్ గా మారింది.

Mariinskyi Palace

Mariinskyi Palace : యుక్రెయిన్ లో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు నేతల భేటీ ఎంత ముఖ్యమో.. వీరు సమావేశమైన చోటుకు అంతే ప్రాధాన్యత ఉంది. రెండు దేశాధినేతలు చర్చలు జరిపిన ప్రదేశానికి, తెలుగు ఫేమస్ సాంగ్ ‘నాటునాటు’కు ఓ లింకుంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం..

Also Read : Russia-Ukraine Conflict : అందరితో భారత్ స్నేహగీతం.. చైనా, పాకిస్తాన్‌కు చెక్ పెట్టే ప్లాన్..!

యుక్రెయిన్ లోని మారిన్స్కీ ప్యాలెస్.. గతంలో పెద్దగా పరిచయం లేని ఈ ప్యాలెస్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాఫిక్ గా మారింది. రష్యాతో యుద్ధానికి ముందే ఈ అద్భుత కట్టడాన్ని సిల్వర్ స్క్రీన్ పై చూపించేలా సాంగ్ షూట్ చేశారు డైరెక్టర్ రాజమౌళి. ప్రపంచ వ్యాప్తంగా నాటునాటు సాంగ్ ఉర్రూతలూగించగా.. ఆ సాంగ్ షూట్ చేసిన ప్యాలెస్ కూడా అంతే ఫేమస్ అయింది. అంతటి ఘనకీర్తి దక్కించుకున్న ఈ ప్యాలెస్సే ప్రధాని మోదీ, జెలెన్‌స్కీ అధికారిక చర్చలకు వేదికైంది.

ఈ ప్యాలెస్ ను రష్యన్ రాణి ఎల్జిబెత్ పెట్రోవ్నా 1744లో నిర్మాణం ప్రారంభించారు. బార్తోలోమియో రాస్త్రెల్లీ అనే ఆర్కిటెక్ట్ బృందం ఆధ్వర్యంలో ప్యాలెస్ నిర్మాణం జరిగింది. ఆ ప్యాలెస్ నిర్మాణం 1752లో పూర్తవ్వగా అప్పటికే ఎల్జిబెత్ మరణించారు. ఈ ప్యాలెస్ మొత్తం రష్యన్ నిర్మాణ శైలిలో ఉంటుంది. ఆ నిర్మాణ శైలిని రోకైల్ శైలి అనికూడా అంటారు. ప్రస్తుతం ఈ మారెన్స్కీ ప్యాలెస్ యుక్రెయిన్ అధ్యక్ష భవనంగా మారింది. ఈ ప్యాలెస్ లో యుక్రెయిన్ చరిత్రకు సంబంధించిన అనేక స్మారక చిహ్నాలు ఉన్నాయి. అలాగే అందులో సుమారు 80 విశాలమైన గదులు ఉన్నాయి. వాటిని యుక్రెయిన్ ప్రముఖులతో పాటు విదేశీ ప్రముఖులకు ఆథిత్యమిచ్చేందుకు ఉపయోగిస్తున్నారు. ప్యాలెస్ లోపల యుక్రెయిన్ కళాకారుల అధ్భుత కళాఖండాలు ఉన్నాయి. ప్యాలెస్ చుట్టూ అందమైన పార్క్ కూడా ఉంటుంది.

Also Read : యుక్రెయిన్ పర్యటనలో ప్రధాని మోదీ.. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న జెలెన్ స్కీ

రష్యాతో యుక్రెయిన్ యుధ్దానికి ముందు నాటు నాటు సాంగ్ ను ఈ ప్యాలెస్ లోనే చిత్రీకరించారు. సినిమా విడుదలైన సమయంలో రష్యా, యుక్రెయిన్ ల మధ్య యుద్ధం మొదలైంది. ఒక వైపు ప్యాలెస్ అందాలు మరోవైపు కొరియోగ్రఫీ అద్భుతంగా ఉండటంతో నాటునాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఇంతటి చరిత్ర కలిగిన మరిన్స్కీ ప్యాలెస్ లో ప్రధాని మోదీ, జెలెన్స్కీ చర్చలు జరిపారు. ఇరువురు నేతల మధ్య ధ్వైపాక్షిక సమావేశం జరిగింది. మోదీకి ఘన స్వాగతం పలికేందుకు మారిన్క్సీ ప్యాలెస్ ను భారత్, యుక్రెయిన్ జెండాలతో సుందరంగా అలంకరించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు