న్యూయార్క్‌లోని క్వీన్స్‌లోని ఓ నైట్‌క్లబ్ వెలుపల కాల్పుల కలకలం చెలరేగింది. ఇందులో దాదాపు 10 మంది గాయపడ్డారు. జమైకాలోని అమాజురా నైట్‌క్లబ్ సమీపంలో గత రాత్రి ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.
న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులకు స్వల్పగాయాలు అయ్యాయి. అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. అమాజురా నైట్‌క్లబ్‌లో డీజేలు, లైవ్ ప్రదర్శనలను నిర్వహిస్తుంటారు.
గత ఏడాది మృతి చెందిన ఓ వ్యక్తి గౌరవార్థం ఆ క్లబ్‌లో ప్రైవేట్ పార్టీని నిర్వహిస్తున్న సమయంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటన జరిగినప్పుడు నైట్‌క్లబ్ వెలుపల దాదాపు 80 మంది ఉన్నారు. వారందరూ లోపలికి వెళ్లేందుకు ఎదురుచూస్తున్న సమయంలో ఈ కాల్పులు జరిగాయి.
అమెరికాలోని సెంట్రల్ న్యూ ఓర్లీన్స్‌లో ఓ ట్రక్కు డ్రైవర్ బీభత్సం సృష్టించిన ఘటనను మరవకముందే ఈ కాల్పుల ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. సెంట్రల్ న్యూ ఓర్లీన్స్‌లో జరిగిన ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది గాయపడ్డారు. బోర్బన్ స్ట్రీట్, ఐబెర్‌విల్లే కూడలి వద్ద ఈ ఘటన జరిగింది. ఆ ట్రక్కు డ్రైవర్ ఆ సమయంలో కాల్పులు కూడా జరిపినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో బాలికల గురుకులాలపై ఫోకస్.. అదనపు కలెక్టర్లు పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు