Mass Shootings Turn Americas Gun Culture Into A Killing Culture
America’s gun culture: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది.. మూడు రాష్ట్రాల్లో దుండగులు కాల్పులకు తెగపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. 30మంది గాయపడ్డారు.. టెక్సాస్ క్యాపిటల్ ఆస్టిన్, చికాగో, జార్జియాలో ఈ కాల్పులు జరిగాయి.
కరోనా ఆంక్షలు తొలగించిన రోజే ఈ కాల్పులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. ఆస్టిన్‌లో ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇక్కడ 14 మంది గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.
చికాగోలో ఇద్దరు దుండగులు ప్రజలపై కాల్పులు జరిపారు. ఇక్కడ ఓ మహిళ మృతిచెందగా.. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. జార్జియాలో ఓ వ్యక్తి చనిపోగా.. ఏడుగురు గాయపడ్డారు. ఇక్కడ గాయపడ్డవారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.
అయితే ఇవన్ని రెండు గ్రూప్‌ల మధ్య జరిగిన గొడవలు కావచ్చొని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అమెరికాలో 267 కాల్పుల ఘటనలు జరిగాయి.