Tennessee
Tennessee: అమెరికాలోని భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 19మందికిపైగా మరణించారు. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న కార్లు గాలిలో ఎగిరిపడ్డాయి. వాటికి మంటలు అంటుకొని దగ్ధమయ్యాయి. ఈ ఘటన టెన్నెస్సీ రాష్ట్రంలోని ఓ మిలిటరీ యుద్ధ సామాగ్రి ప్లాంటులో చోటు చేసుకుంది. ఈ ప్లాంటులో పేలుడు పదార్థాల అభివృద్ధి, తయారీ, నిర్వహణ పనులు జరుగుతుంటాయి.
పేలుడు దాటికి ఆ ప్రాంతంలో దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడు శబ్దం కొన్ని మైళ్ల దూరం వరకు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. పేలుడు దాటికి సమీపంలోని ఇళ్లు, పార్కు చేసిన ఉన్న వాహనాలు ఒక్కసారిగా కంపించాయి. ఈ పేలుడుకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, ఈ పేలుడుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఎఫ్‌బీఐ ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టింది.
Also Read: Putin: ట్రంప్ కి దక్కని నోబెల్ శాంతి బహుమతి.. రష్యా అధ్యక్షుడు పుతిన్ షాకింగ్ కామెంట్స్..
పేలుడు తరువాత క్రిస్ డేవిస్ విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రమాదంలో 19మంది మరణించారు. నలుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ పేలుడు ప్రాంతాన్ని నేను పరిశీలించాను. అత్యంత వినాశకరమైన ప్రదేశాల్లో ఒకటిగా అభివర్ణించాడు. చెప్పడానికి ఏమీల లేదు.. పేలుడు ప్రాంతంలో అర చదరపు మైలు పేలుడుదాటికి పడిన శిథిలాలు ఉన్నాయని అన్నారు. ఈ పేలుడు ఎలా జరిగిందనే విషయాన్ని తెలుసుకునేందుకు పలు ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయి. దర్యాప్తు కొనసాగుతుంది. పూర్తి వివరాలు తెలియాలంటే సమయం పడుతుందని డేవిస్ చెప్పారు.