Earthquake : వామ్మో.. రష్యాను మరోసారి వణికించిన భారీ భూకంపం.. సునామీ వార్నింగ్

Earthquake : రష్యాను మరోసారి భారీ భూకంపం వణికించింది. కామ్చాట్కా తీరంలో భూకంప తీవ్రత రికర్టర్ స్కేల్ పై 7.1గా నమోదైంది.

Earthquake

Earthquake : రష్యాను మరోసారి భారీ భూకంపం (Earthquake) వణికించింది. కామ్చాట్కా తీరంలో భూకంప తీవ్రత రికర్టర్ స్కేల్ పై 7.1గా నమోదైంది. 10కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జర్మనీ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ వెల్లడించింది. భూకంపం కేంద్రం నుంచి 300 కిలో మీటర్ల పరిధిలోని తీరప్రాంతాల్లో ప్రమాదకర అలలు సంభవించే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది.

Also Read: Sushila Karki: నేపాల్‌కు కొత్త లీడర్.. తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి.. ఎవరీ సుశీల.. భారత్‌తో ఉన్న అనుబంధం ఏంటి..

కామ్చాట్కా ద్వీపకల్పంలో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇటీవల ఇదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అప్పట్లో రష్యాలోనే కాకుండా.. అమెరికా, జపాన్, హవాయి, చిలీ, కోస్టారికా, ఇతర ప్రాంతాల్లో కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం 7.1తీవ్రతతో వచ్చిన భూకంపం నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.