Burnt Alive: అమెరికాలో ఘోరం.. హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం.. మృతుల్లో ఇద్దరు పిల్లలు

అట్లాంటాలోని బంధువుల ఇంటికి వారంతా కారులో వెళ్లారు. వారం రోజుల పాటు అట్లాంటాలోనే ఉన్నారు.

Burnt Alive: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం సజీవ దహనమైంది. మృతుల్లో హైదరాబాద్ కి చెందిన తేజస్విని, శ్రీ వెంకట్ దంపతులతో పాటు వారి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకట్, తేజస్విని దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి వెకేషన్ కోసం ఇటీవలే హైదరాబాద్ నుంచి డల్లాస్ వెళ్లారు.

అట్లాంటాలోని బంధువుల ఇంటికి వారంతా కారులో వెళ్లారు. వారం రోజుల పాటు అట్లాంటాలోనే ఉన్నారు. తిరిగి డల్లాస్ వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్థరాత్రి వారు డల్లాస్ కు తిరుగు ప్రయాణం అయ్యారు. గ్రీన్ కౌంటీ ఏరియాలో రాంగ్ రూట్ లో వచ్చిన మినీ ట్రక్ వెంకట్ దంపతులు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

అంతే.. కారులో ప్రయాణిస్తున్న నలుగురు సజీవ దహనం అయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో ఎముకలను ఫోరెన్సిక్ కు పంపారు పోలీసులు. వెంకట్ దంపతుల సజీవ దహనం గురించి తెలిసి వారు బంధువులు షాక్ కి గురయ్యారు. వెంకట్ కుటుంబం ఇక లేదు అని తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read: తోడికోడలిని జీవితాంతం ఏడిపించాలనే.. కోపం, అసూయతోనే.. చిన్నారి హితిక్ష హత్య కేసులో వీడిన మిస్టరీ