కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టినవారిలో కోల్‌కతా మహిళ

  • Publish Date - June 1, 2020 / 08:08 AM IST

ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ..ప్రపంచ వ్యాప్తంగా పేరున్నవర్శిటీ అయిన ఈ ఆక్స్ ఫర్డ్ వర్శిటీ కరోనాకు వ్యాక్సిన్ కనుగొంది.  ఈ టీకాను కనుగొనటంలో మన భారతదేశానికి చెందిన మహిళ కీలక పాత్ర వహించింది. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఆమె పేరు చంద్రబాలి దత్తా. వయస్సు 34ఏళ్లు. ఆక్స్ ఫర్డ్ వర్శిటీలో చంద్రబాలి దత్తా క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్ గా పనిచేస్తున్నారు.  ఈ వ్యాక్సిన్ తయారు చేసే టీమ్ లో చంద్రబాలి కీలక పాత్ర వహించారు.  

జెన్నర్ ఇన్స్టిట్యూట్ అంటే ChAdOx1 nCoV-19 అనే వ్యాక్సిన్ మానవ పరీక్షలలో రెండవ దశ..మూడవ దశల్లోని  కరోనా వైరస్‌తో పోరాడటానికి సాధనంగా ఉంటుంది. వ్యాక్సిన్ ట్రయల్ దశలో క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్ పాత్ర అత్యంత కీలకమైనది. వ్యాక్సిన్ లో నాణ్యత ఎంత ఉంది? ఎంతగా పనిచేస్తుంది?  ట్రయల్స్ ఎంతగా సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది? వంటి స్థాయిలకు అనుమతులు ఉండేలా చూడటం ఆమె పని. 

కోల్‌కతాకు చెందిన చంద్రబాలి దత్తా గోఖలే మెమోరియల్ గర్ల్స్ స్కూల్‌లోను తరువాత కోల్‌కతాలోని హెరిటేజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్..బయోటెక్నాలజీలో బిటెక్ పూర్తి చేశారు. తరవుాత లీడ్స్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి-బయోసైన్స్ అధ్యయనం చేయడానికి యుకెకు వెళ్లారు.

దీనిపై చంద్రబాలి మాట్లాడుతూ..ప్రపంచం అంతా కరోనా వైరస్ ను అంతంచేసేందుకు వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తోందనీ..మేము కనుగొన్న ఈ వ్యాక్సిన కరోనాను అంతం చేస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టులో తాను కూడా భాగం కావడటం చాలా సంతోషంగా ఉందనీ ఇదొక గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఈ వ్యాక్సిన్ విజయవంతం కావడానికి ప్రతిరోజూ గడియారంతోపాటు పోటీ పని పనిచేశారని అన్నారు.

Read: కరోనాకి దూరంగా : సోషల్ డిస్టెన్సింగ్ ‘షూ’