Mega Genomic Project : జంతువు నుంచే మనిషి.. ఇద్దరికీ దగ్గరి సంబంధం.. రెండింటిలోనూ ఒకే రకం జన్యువులు

జంతువులకు, మనుషులకు చాలా దగ్గర సంబంధం ఉందని తేల్చారు. ఇందులోని 1శాతం జన్యువుల్లో కణాల కార్యకలాపాలను నియంత్రించే ప్రొటీన్ ఉత్పత్తి జరుగుతున్నట్లు గుర్తించారు.

Mega Genomic Project

Mega Genomic Project : మనిషి కోతి జాతి నుంచి పరిణామం చెందుతూ వచ్చాడని చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం చెబుతున్న విషయం తెలిసిందే. ఆధునిక జీవశాస్త్రంలోని ఈ సిద్ధాంతం చాలా మార్పులు తీసుకొచ్చింది. మూఢనమ్మకాలను విభేదించడంలో డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం కీలక పాత్ర పోషించింది. మనిషిని దేవుడు సృష్టించాడనే వాదాన్ని బలంగా వ్యతిరేకింది.

అయితే, ఈ సిద్ధాంతం నిజమా.. కాదా అనే దానిపై వివాదాలు కొనసాగుతున్నాయి. కొంతమంది శాస్త్రవేత్తల మెగా జీనోమిక్ ప్రాజెక్టు ఇందుకు సంబంధించిన కొన్ని పక్కా ఆధారాలను కనుగొంది. జన్యుపరంగా మనుషులకు, జంతువులకు ఉన్న దగ్గరి సంబంధాన్ని శాస్త్రీయంగా గుర్తించింది. మనుషులకు, జంతువులకు మధ్య జన్యుపరంగా ఎలాంటి సంబంధం ఉందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తల బృందం మెగా జీనోమిక్ ప్రాజెక్టును చేపట్టింది.

Flower Species: 99 మిలియన్ సంవత్సరాల పుష్పాల శిలాజాలు గుర్తింపు

ఇందులో భాగంగానే 100 మిలియన్ ఏళ్ల నుంచి మనుషులతో సహా గబ్బిలాల నుంచి మొదలుకొని అడవి దున్న వరకు మొత్తం 240 క్షీరదాల్లోని జన్యు డాటాను పోల్చి చూసింది. జీవ పరిణామ క్రమం నుంచి ఈ క్షీరదాల్లోని జన్యువుల్లో కొంత మేర మార్పులేకుండా అలాగే కొనసాగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. మనుషులు, కొన్ని రకాల జంతువుల్లో 10 శాతం జన్యువులు ఒకేలా ఉన్నట్లు గుర్తించారు.

అంటే జంతువులకు, మనుషులకు చాలా దగ్గర సంబంధం ఉందని తేల్చారు. ఇందులోని 1శాతం జన్యువుల్లో కణాల కార్యకలాపాలను నియంత్రించే ప్రొటీన్ ఉత్పత్తి జరుగుతున్నట్లు గుర్తించారు. కొన్ని రకాల జంతువులు వాటి పూర్వీకులతో పోల్చినప్పుడు చాలా మార్పులకు గురైనట్లు తెలుసుకున్నారు. అవి వాటి పరిసరాలకు తగ్గట్టు మార్పు చెందుతున్నాయని తేల్చారు.

Human Lifespan : మనిషికి మరణం లేదా? ఎన్నేళ్లైనా బతకొచ్చా? పరిశోధనలో ఆసక్తికర విషయాలు

పర్యావరణ వ్యవస్థలోనూ జీవించేందుకు అనుగుణంగా క్షీరదాలు తమను తాము మార్పు చేసుకున్నట్లు గుర్తించారు. చింపాజీలు, మనుషుల్లో కొంతమేర డీఎన్ఏ లోపించడం జన్యు వ్యక్తీకరణలోనే భారీ మార్పులు తెచ్చిందని మనుషుల్లో మెదడు అభివృద్దికి కారణమైందని కనుగొన్నారు.

1925లో అలస్కాలోని నోమ్ కు అత్యంత కఠిన పరిస్థితుల్లో డిఫ్తీరియా సీరమ్ ను మోసుకెళ్లి చాలా మంది యువకుల ప్రాణాలు కాపాడిన బాల్టో అనే కుక్కలోని జన్యువుల డాటాను పరిశోధకులు విశ్లేషించారు. ఇతర కుక్క జాతులతో పోల్చినప్పుడు బాల్టో కుక్క జన్యుపరంగా వైవిధ్యం కలిగి ఉందని గుర్తించారు.ఈ కుక్క అత్యంత కఠిన పరిస్థితులను తట్టుకునే జన్యు వైవిధ్యం కలిగి ఉందని కనుగొన్నారు.