Flower Species: 99 మిలియన్ సంవత్సరాల పుష్పాల శిలాజాలు గుర్తింపు

డైనోసార్ల కాలం నాటికి చెందినవిగా భావిస్తున్న.. రెండు శిలాజ పూల జాతులను శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమిపై పుష్పాలు ఎలా ఆవిర్భవించాయనే ఒక చిక్కుముడికి సమాధానం లభించనుంది.

Flower Species: 99 మిలియన్ సంవత్సరాల పుష్పాల శిలాజాలు గుర్తింపు

Flowers

Flower Species: డైనోసార్ల కాలం నాటికి చెందినవిగా భావిస్తున్న.. రెండు శిలాజ పూల జాతులను శాస్త్రవేత్తలు గుర్తించారు. గడ్డకట్టిన బంకలో చిక్కుకుని అద్భుతంగా సంరక్షించబడిన ఈ పూల ద్వారా.. భూమిపై పూల ఆవిర్భావాన్ని తెలుసుకోవచ్చని వృక్షశాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఉత్తర మయాన్మార్ లో ఉన్న కొన్ని నిక్షేపాలలో ఈ పూలను కొనుగోన్నారు శాస్త్రవేత్తలు. దీనిపై నేచర్ ప్లాంట్స్ అనే పేపర్ వెల్లడించిన కథనం మేరకు.. దాదాపు 99 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై జీవం ఆవిర్భవించిన సమయానికి ముందే భూమిపై చెట్లు, మొక్కలు, పూలు ఉన్నాయి. అయితే ఆధునిక కాలంలో జీవ పరిణామ సిద్ధాంతాన్ని కనిపెట్టిన చార్లెస్ డార్విన్ సైతం మొక్కల(పూలు పూసే మొక్కలు)పై పరిశోధనలు చేయగా.. వాటి పరిణామక్రమం మాత్రం రహస్యంగానే ఉండిపోయింది.

Also read:ISRO Rockets: చంద్రయాన్ 3 సహా 19 ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన ఇస్రో

డార్విన్ తదనానంతరం అనేకమంది వృక్ష శాస్త్రవేత్తలు మొక్కలపై పరిశోధనలు చేస్తున్నా.. మొక్కల పరిణామక్రమాన్ని మాత్రం ఛేదించలేకపోయారు. మొక్కలకు సంబందించిన శిలాజాలు అరుదుగా లభించడం ఒక కారణం అయితే..లభించిన ఆ మొక్కల్లో సున్నితమైన నిర్మాణాలు ఉండడం లేదా ఉపరితల అల్లికలు లేకపోవడం వల్ల వాటి మధ్యనున్న సారూప్యతలను కనుగొనడం శాస్త్రవేత్తలకు కష్టతరంగా మారింది. అయితే ప్రస్తుతం లభించిన ఈ రెండు పుష్పాలు బంకలో చిక్కుకుని సజీవంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మయన్మార్ లోని కాచిన్ రాష్ట్రంలో నిక్షేపాలలో మాత్రమే కనిపించే ఈ జాతుల పుష్పాలు తమ పరిశోధనలకు ఎంతో ఊతమిస్తాయని యూకేకి చెందిన ప్రముఖ వృక్షశాస్త్ర నిపుణుడొకరు నేచర్ ప్లాంట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Also read:Karnataka Muslim Students: బురఖా ధరించి వచ్చిన ముస్లిం విద్యార్థినులను అడ్డుకున్న ప్రిన్సిపాల్

ప్రస్తుతం కనుగొన్న ఈ పుష్ప జాతులు.. దక్షిణాఫ్రికాలోని అగ్ని-ప్రభావ పర్యావరణ వ్యవస్థలలో పుష్పించే టాక్సా జాతికి చెందిన ఫైన్‌బోస్ వంటి పుష్పలను పోలి ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రెండు పుష్పాలు ఫిలికా పిలోబర్మెన్సిస్ sp. nov. మరియు ఎయోఫిలికా ప్రిస్కాస్టెల్లాటా gen. et sp. Nov. జాతులకు చెందినవిగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ పుష్పాలలో నేటికీ సజీవంగా ఉన్న రెమ్మల గుజ్జు ఆధారంగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేయనున్నారు. తద్వారా భూమిపై పుష్పాలు ఎలా ఆవిర్భవించాయనే ఒక చిక్కుముడికి సమాధానం లభించనుంది. పుష్పించే పూల కారణంగానే భూమిపై కీటకాలు, ఉభయచరాలు, క్షీరదాలు మరియు పక్షుల జాతుల్లో వైవిధ్యత వచ్చిందని..సముద్రంలో కంటే భూమిపై జీవం వైవిధ్యంగా మారినప్పుడు పుష్పాలు ఆవిర్భవించి ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Also read:Toyota Hilux: కొత్త పికప్ ట్రక్ బుకింగ్ లు నిలిపివేసిన టొయోటా, కారణం?