నా హెయిర్ చిన్నగా ఉండేది.. అమ్మాయినని చెప్పకుండా అబ్బాయిలతో క్రికెట్ ఆడేదాన్ని.. చివరకు..: వరల్డ్ కప్ టీమ్ మెంబర్ అరుంధతి
"మా అన్న గల్లీ క్రికెట్ ఆడేవాడు. నన్ను కూడా తీసుకెళ్లాలని మా అన్నయ్యను అడిగేదాన్ని. గర్ల్‌ని ఆడనివ్వరని మా అన్నయ్య అనేవాడు" అని తెలిపింది.
Arundhati Reddy
Arundhati Reddy: చిన్నప్పటి నుంచే తనకు క్రికెట్ అంటే పిచ్చి అని మహిళల వన్డే ప్రపంచ కప్-2025 టీమ్ మెంబర్ అరుంధతి రెడ్డి తెలిపింది. ప్రపంచ కప్ సాధించిన తర్వాత ఇటీవలే ఆమె హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే.
ఇవాళ 10టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఉమెన్స్ క్రికెట్ ఎగ్జిస్ట్ అవుతుందని అనుకోలేదని చెప్పింది. చిన్నప్పటి నుంచి క్రికెట్ చూస్తుండేదాన్నని తెలిపింది.
రాత్రి సమయంలోనూ మ్యాచులు చూసేదాన్నని అరుంధతి రెడ్డి (Arundhati Reddy) చెప్పింది. స్కూల్‌కి వెళ్లకుండా మ్యాచులు చూడడం వంటివి చేసేదాన్నని తెలిపింది.
Also Read: స్మృతి మంధాన 100 రన్స్ కొట్టినా కూడా మేము ఇలాగే అనేవాళ్లం: వరల్డ్ కప్ టీమ్ మెంబర్ అరుంధతి రెడ్డి
“మా అన్న గల్లీ క్రికెట్ ఆడేవాడు. నన్ను కూడా తీసుకెళ్లాలని మా అన్నయ్యను అడిగేదాన్ని. గర్ల్‌ని ఆడనివ్వరని మా అన్నయ్య అనేవాడు. నాకు హెయిర్ చిన్నగా అబ్బాయిల్లా ఉండేది. అలా వెళ్లి అబ్బాయిలతో ఆడాను. చివరకు ఆ అబ్బాయిలే మా అమ్మ వద్దకు వచ్చి బాగా ఆడుతుందని చెప్పారు. మా అమ్మ తీసుకెళ్లి అకాడమీలో జాయిన్ చేశారు. నాకు టాలెంట్ ఉందని, ఇండియా తరఫున ఆడతానని కోచ్ గణేశ్ అన్నారు” అని అరుంధతి రెడ్డి చెప్పింది.
తన తల్లే తనకు స్ఫూర్తి అని, అన్ని సమయాల్లోనూ సపోర్టు చేశారని అరుంధతి రెడ్డి చెప్పింది. క్రికెట్‌లో స్ఫూర్తి అని ప్రత్యేకంగా ఎవరూ లేరని తెలిపింది. రాహుల్ ద్రవిడ్, బెన్‌స్టోక్స్ అంటే ఇష్టమని చెప్పింది.
