ISRO Rockets: చంద్రయాన్ 3 సహా 19 ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన ఇస్రో

చంద్రుడిపై పరిశోధనల నిమిత్తం భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్-3 ఆగస్టు 2022 నాటికీ ప్రయోగించనున్నారు.ఇస్రో ఆధ్వర్యంలో 2022కి గానూ మొత్తం 19 అంతరిక్ష ప్రయోగాలు జరపనున్నారు

ISRO Rockets: చంద్రయాన్ 3 సహా 19 ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన ఇస్రో

Isro

ISRO Rockets: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆధ్వర్యంలో 2022కి గానూ మొత్తం 19 అంతరిక్ష ప్రయోగాలు జరపనున్నారు. ఈమేరకు అంతరిక్ష పరిశోధనశాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పార్లమెంటులో లిఖితపూర్వక ప్రకటనను చదివి వినిపించారు. చంద్రుడిపై పరిశోధనల నిమిత్తం భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్-3 ఆగస్టు 2022 నాటికీ ప్రయోగించనున్నారు. “చంద్రయాన్-2” నుండి నేర్చుకున్న పాఠాలు మరియు జాతీయ స్థాయి నిపుణులచే అందించబడిన సూచనల ఆధారంగా, చంద్రయాన్-3 ప్రయోగంలో పురోగతి సాధిస్తామని మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఈమేరకు ఇప్పటికే హార్డ్‌వేర్ మరియు ఇతర ప్రత్యేక పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని ఆగస్టు 2022లో ప్రయోగాన్ని విజవంతంగా లాంచ్ చేయనున్నట్లు మంత్రి వివరించారు.

Also read: Karnataka Muslim Students: బురఖా ధరించి వచ్చిన ముస్లిం విద్యార్థినులను అడ్డుకున్న ప్రిన్సిపాల్

2022 జనవరి నుంచి డిసెంబర్ మధ్య కాలంలో మొత్తం 19 ప్రయోగాలు జరుపనుండగా.. వాటిలో ఎనిమిది ‘లాంచ్ వెహికల్ మిషన్‌లు’, ఏడు ‘స్పేస్‌క్రాఫ్ట్ మిషన్‌లు’ మరియు నాలుగు ‘టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ మిషన్‌లు ఉన్నట్లు మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా అనేక ప్రయోగాలకు ఆటంకం ఏర్పడిందని.. అదే సమయంలో.. కేంద్రం తెచ్చిన స్పేస్ సెక్టార్ సంస్కరణలు మరియు కొత్తగా ప్రవేశపెట్టిన డిమాండ్ ఆధారిత నమూనాల నేపథ్యంలో ప్రాజెక్ట్‌ల పునఃప్రాధాన్యత కూడా జరిగిందని ఆయన చెప్పారు.

Also read: Toyota Hilux: కొత్త పికప్ ట్రక్ బుకింగ్ లు నిలిపివేసిన టొయోటా, కారణం?

గత మూడు సంవత్సరాలలో ప్రయోగించిన ఉపగ్రహాల జాబితా వివరాలను జితేంద్ర సింగ్ సభలో వెల్లడించారు. ఆగస్టు 12, 2021న EOS-03 ప్రయోగించబడింది; Amazonia-1 ఫిబ్రవరి 28, 2021న ప్రయోగించారు; సతీష్ ధావన్ SAT (SDSAT) ఫిబ్రవరి 28, 2021న మరియు UNITYsat ఫిబ్రవరి 28, 2021న ప్రయోగించారు. CMS-01 డిసెంబర్ 17, 2020న ప్రయోగించబడింది; EOS-01 (నవంబర్ 7, 2020); GSAT-30 (జనవరి 17, 2020) 2019లో ప్రారంభించబడిన వాటిలో RISAT-2BR1 (డిసెంబర్ 11, 2019); కార్టోశాట్-3 (నవంబర్ 27, 2019); చంద్రయాన్-2 (జూలై 22, 2019); RISAT-2B (మే 22, 2019); EMISAT (ఏప్రిల్ 1, 2019); GSAT-31 (ఫిబ్రవరి 6, 2019); మైక్రోసాట్-ఆర్ (జనవరి 24, 2019) మరియు కలామ్‌శాట్-వి2 (జనవరి 24, 2019) ప్రయోగించబడినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సభకు తెలియజేసినట్లు మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసింది.

Also read: Amazon Jeff Bezos: జెఫ్ బెజోస్ భారీ పడవ కోసం చారిత్రక వంతెనను కూల్చనున్న నెదర్లాండ్స్