Amazon Jeff Bezos: జెఫ్ బెజోస్ భారీ పడవ కోసం చారిత్రక వంతెనను కూల్చనున్న నెదర్లాండ్స్

జెఫ్ బెజోస్ పడవను తరలించేందుకు.. ఈ బ్రిడ్జీని తొలగించాల్సి వస్తుంది. బ్రిడ్జీని తొలగించేందుకు అయ్యే ఖర్చు మాత్రం తాము భరించలేమంటూ అక్కడి ప్రభుత్వం, పడవ తయారీ సంస్థ చేతులెత్తాశాయి.

Amazon Jeff Bezos: జెఫ్ బెజోస్ భారీ పడవ కోసం చారిత్రక వంతెనను కూల్చనున్న నెదర్లాండ్స్

Jeff

Amazon Jeff Bezos: డబ్బున్న మారాజులు తలుచుకోవాలేగాని..చిటికెలో భోగభాగ్యాలు తమ ముందుకు తెచ్చుకుంటారు. ఈ అక్షర సత్యాన్ని అక్షరాలా రుజువు చేస్తున్నాడు.. అమెజాన్ సంస్థ అధినేత, అపరకుబేరుడు.. జెఫ్ బెజోస్. ప్రపంచంలోనే అత్యధిక సంపనుల్లో రెండో స్థానంలో ఉన్న జెఫ్ బెజోస్..గత కొంతకాలంగా తన వ్యక్తిగత పర్యటనలపై ద్రుష్టి పెడుతున్నాడు. గతేడాది అమెజాన్ సీఈఓ పదవి నుంచి తప్పుకున్న బెజోస్.. ఇప్పుడు తీరిక లేకుండా పర్యటనలకు వెళ్తున్నాడు. అందులో భాగంగా సముద్రయానం చేసేందుకు ఒక భారీ విలాసవంతమైన పడవను ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడు బెజోస్. నెథర్లాండ్ కు చెందిన విలాస పడవల తయారీ సంస్థ “ఓషన్కో” ఈ భారీ పడవను తయారు చేసింది.

Also read: Corvid Cleaning: కాకుల్ని రంగంలోకి దింపిన ప్రభుత్వం..కోట్ల రూపాల ఖర్చు తగ్గించిన అధికారులు

దాదాపు 417 అడుగుల పొడవు, 127 అడుగుల ఎత్తుతో.. కదిలే స్వర్గసీమగా చెప్పుకుంటున్న ఈ పడవలో సకల సౌకర్యాలు ఉన్నాయి. Y721గా నామకరణం చేసిన ఈ పడవలో హెలికాప్టర్, సినిమా థియేటర్, ప్రత్యేక మీటింగ్ హాల్, విలాసవంతమైన పడక గదులు వంటి సదుపాయాలు ఉన్నాయి. నెదర్లాండ్స్ లోని రోటర్‌డ్యామ్ పోర్ట్ ఏరియాలో తయారు చేసిన ఈ పడవ మరికొన్ని రోజుల్లో జెఫ్ వద్దకు చేరుకోనుంది. అయితే పడవను డెలివరీ చేసేందుకు పెద్ద చిక్కు వచ్చిపడింది. పడవను రోటర్‌డ్యామ్ పోర్ట్ నుంచి బయటకు తరలించాలంటే.. స్థానికంగా ఉన్న ఒక చారిత్రాత్మక వంతెన అడ్డుగా ఉంది. “డి హెఫ్(De Hef)”గా పిలిచే ఆ వంతెన కిందనున్న నీటి మార్గం ద్వారా పడవను సముద్ర జలాల్లోకి తీసుకురావాల్సి ఉంటుంది.

Also read: PRASHAD Scheme: కేంద్ర ప్రభుత్వ “ప్రషాద్ పథకంలో” ఏపీ నుంచి 4 దేవస్థానాలు

పడవ ఎత్తు సుమారు 127 అడుగులుగా ఉంటే.. వంతెన ఎత్తు 131 అడుగులు ఉంది. నాలుగడుగుల తేడా ఉన్నా.. వంతెనకు ఉన్న ఇనుప ఇరుసులు పడవ పైభాగానికి అడ్డుగా వస్తున్నట్లు ఇంజినీర్లు లెక్కగట్టారు. దీంతో బ్రిడ్జిని తొలగిస్తే తప్ప.. జెఫ్ పడవ బయటకు వచ్చే మార్గం లేదని రోటర్‌డ్యామ్ నగర అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. “కోనింగ్‌షావెన్‌బర్గ్ డి హెఫ్” వంతెనకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. 1878లో నెథర్లాండ్స్ లో పారిశ్రామికాభివృద్ధి, పోర్టు అభివృద్ధికి చిహ్నంగా ఏర్పాటు చేసిన ఆ వంతెనను.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1940లో నాజీలు కూల్చివేశారు. అనంతరం తిరిగి నిర్మించారు. అప్పటి నుంచి డి హెఫ్ వంతెన స్థానికంగా ఒక ల్యాండ్ మార్క్ గా, పర్యాటక ప్రాంతంగా పేరుపొందింది.

Also read: Adhaar PVC Card: ఆధార్ పీవీసీ కార్డుకి అప్లై చేసుకోనే విధానం

ఇక ఇప్పుడు జెఫ్ బెజోస్ పడవను తరలించేందుకు.. ఈ బ్రిడ్జీని తొలగించాల్సి వస్తుంది. అయితే ఈ చారిత్రక బ్రిడ్జీని తొలగించేందుకు అయ్యే ఖర్చు మాత్రం తాము భరించలేమంటూ అక్కడి ప్రభుత్వం, పడవ తయారీ సంస్థ చేతులెత్తాశాయి. దీంతో ఆ బ్రిడ్జీని ఊడదీసేందుకు.. అవసరమైన ఖర్చు సైతం బెజోస్ భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే పడవ తయారీ కోసం $485 మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చు చేసిన బెజోస్.. బ్రిడ్జీని తొలగించి, తిరిగి పునర్నిర్మించేందుకు అయ్యే ఖర్చును సైతం భరిస్తుండడంతో ఈ మొత్తం ఖర్చు $500 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ.3,745 కోట్లతో సమానం.