Corvid Cleaning: కాకుల్ని రంగంలోకి దింపిన ప్రభుత్వం.. రూ.కోట్ల ఖర్చు తగ్గించిన అధికారులు

ప్రభుత్వానికి కాకులు కోట్ల రూపాయల ఖర్చు తగ్గిస్తున్నాయి. కాకుల్ని రంగంలోకి దింపిన ప్రభుత్వం..కోట్ల రూపాల ఖర్చు తగ్గించుకుంటోంది.

Corvid Cleaning: కాకుల్ని రంగంలోకి దింపిన ప్రభుత్వం.. రూ.కోట్ల ఖర్చు తగ్గించిన అధికారులు

Corvid Cleaning  In Sweden

Corvid Cleaning  In Sweden : కాకులు పొద్దు పొద్దున్నే అరుస్తు జనాలను నిద్ర లేపటమేకాదు..చనిపోయినవారికి పిండాలు పెడితే కావు కావుమంటూ వచ్చి పిండాలు తినటమేకాదు ఏకంగా ప్రభుత్వానికి కోట్ల రూపాయల్ని ఆదా చేస్తున్నాయి కాకులు. ఏంటీ కాకులా? ప్రభుత్వానికి ఖర్చు తగ్గిస్తున్నాయా? అనే ఆశ్చర్యపోవచ్చు. కానీ కోతినుంచి మనిషిగా అవరించి..నేటి ఆధునిక యుగలంలో ఇతర గ్రహాలమీద కూడా కాలు పెడుతున్న మనిషి చేసే తప్పులు అన్నీ ఇన్నీ కావు.

అలా మనిషి చేసే తప్పుల్ని కాకులు సరిచేస్తున్నాయి.మనిషికి బుద్ధి చెబుతున్నాయి కాకులు. ‘ ఓ మనిషీ..ఇంకా ఎన్నాళ్లు పక్షుల్ని, జంతువుల్ని చూసి నేర్చుకుంటారు? అని ప్రశ్నించేలా కాకులు చేసే పనికి నేటి ఈ ఆధునిక మానవుడు సిగ్గు పడాల్సిందేననే మహత్తర కార్యక్రమంలో కాకులు భాగం పంచుకున్నాయి. మనుషులు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేస్తుంటే కాకులు ఆ చెత్తను పట్టుకెళ్లి డబ్బాల్లో వేస్తున్నాయి. కాకులు తెలివైనవి. అందుకే స్వీడన్ లో అధికారులు రోడ్లపై చెత్తను క్లీన్ చేయటానికి కాకుల్ని రంగంలోకి దింపారు. అలా కాకులు చెత్త ఏరి ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ఖర్చు తగ్గిస్తున్నాయి. మరి ఆ కాకుల చేసే ఘనకార్యం ఏంటో తెలుసుకుందాం..

Also read : Pharma Companies: ఫార్మా కంపెనీల పొల్యూషన్‌పై NGT సీరియస్

చెత్త సమస్యకు చెక్‌ పెట్టేందుకు..కాకుల్ని రంగంలోకి దింపిన ప్రభుత్వం..
స్వీడన్‌ ప్రజలు వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడేస్తున్నారు. సిగరెట్‌ తాగి పీకలను చెత్త డబ్బాల్లో వేయకుండా నిర్లక్ష్యంగా రోడ్డుపై విసిరేస్తున్నారు. దీంతో వీధుల్లో పడే చెత్తలో దాదాపు 62 శాతం సిగరెట్‌ పీకలే ఉంటున్నాయని స్వీడన్‌ టైడీ ఫౌండేషన్‌ చెబుతోంది. వీధుల్లో ఏటా దాదాపు 100 కోట్ల వరకు సిగరెట్‌ పీకలను పడేస్తున్నారని వెల్లడించింది.

సిగరెట్‌ పీకలు, చెత్త సమస్య అనేది స్వీడన్‌ లోని సోడెర్టాల్జె మున్సిపాలిటీకి తలనొప్పిగా మారింది. దారుల్ని పరిశుభ్రం చేయటానికి ప్రతీ సంవత్సరం దాదాపు రూ. 16 కోట్లు ఖర్చు చేస్తోందీ ఆ మున్సిపాలిటీ. దీంతో సోడెర్టాల్జె నగరంలోని స్టార్టప్‌ సంస్థ ‘కోర్విడ్‌ క్లీనింగ్‌’ తెలివిగా కాకులను రంగంలోకి దింపింది. చెత్తను, సిగరెట్‌ పీకలను తీసుకెళ్లి ఓ డబ్బాలో పడేసేలా కాకులకు చక్కటి ట్రైనింగ్ ఇచ్చింది. అలా చెత్త వేయగాని కాకులు తినటానికి ఆ డబ్బాలోంచి తిండి వచ్చేలా ఏర్పాటు చేసింది. ఇందుకు ఆ సంస్థ ఓ ప్రత్యేకమైన డబ్బాలను తయారు చేసి వాటిని రోడ్ల పక్కల ఏర్పాటు చేసింది.

Also read : Air Pollution : ఢిల్లీలో డేంజర్ బెల్స్ : కాలుష్యం కమ్మేసింది.. భారీగా క్షీణించిన గాలి నాణ్యత..!

కాకులే ఎందుకు అంటే..
సాధారణ కాకుల కంటే కోర్విడ్‌ జాతికి చెందిన న్యూ కెలడోనియా కాకులు చాలా తెలివైనవి. ఈ వాస్తవం ఓ పరిశోధనలో నిరూపించబడిందికూడా. ఏడేళ్లున్న మనిషి ఎలా ఆలోచిస్తాడో అచ్చం అలా ఆలోచించే సామర్థ్యం ఈ కోర్విడ్ జాతికి చెందిన కాకుల సొంతమని తేలింది. ఈ జాతికి చెందిన కాకులు నేర్పిస్తే ఏవైనా నేర్చుకుంటాయట. అంతేకాదు ఈ కాకులకు మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేమంటే మనం ఏదైనా కోర్విడ్ జాతికి చెందిన ఓ కాకికి నేర్పిస్తే…ఆ కాకి తమ పక్క కాకులకు కూడా నేర్పిస్తాయి కూడా. అంత తెలివైనవి ఈ కోర్విడ్ జాతి కాకులు..

ఈ విషయాన్ని గుర్తించిన ఈ సంస్థ ఈ పక్షులకే ఇప్పుడు చెత్త క్లీనింగ్‌పై శిక్షణనిచ్చారు. సిగరెట్‌ పీకలను, చెత్తను ఆహారం అనుకొని తినే అవకాశమే లేదని తేలింది. వీటి గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నాకే ట్రైనింగ్ ఇచ్చారు.

కాకుల వాడకం పెరిగాక..గతం కంటే భారీగా తగ్గిన మున్సిపాలిటీ ఖర్చు..
మున్సిపాలిటీ సిబ్బందికి ఒక్కో సిగరెట్‌ పీకను తీయడానికి అయ్యే ఖర్చుల్లో నాలుగో వంతు ఖర్చు చేస్తే చాలు కాకులు ఆ పని చక్కగా చేసి పెట్టేస్తున్నాయి. అంటే మొత్తంగా పీకలను తీయడానికి అయ్యే ఖర్చులో దాదాపు 75% తగ్గించేస్తున్నాయన్నమాట.

Also read : Employees Arrest in AP : పోలీసులకూ పీఆర్సీ వర్తిస్తుంది..వారు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయాలి : సోము వీర్రాజు

దీనిపై సదరు సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ..ఇప్పటి వరకు కాకులకు ఇటువంటి ట్రైనింగ్ ఇచ్చామని ఇక ముందు ఈ ట్రైనింగ్ తీసుకోవటానికి ఎటువంటి పక్షులు చేస్తాయో గ్రహం వాటికి కూడా ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. ఇది కేవలం నగరాన్ని పరిశు భ్రంగా ఉంచడానికి మాత్రమే కాదని.. ప్రజలు కూడా వారి పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా చేయాలనేదే తమ ఉద్దేశమని తెలిపారు.

మనిషి ఇంకెంత కాలం పక్షులు, జంతువులను చూసి నేర్చుకోవాలో..?!
ఏదేమైనా చెత్తను తొలగించడానికి పక్షులకు కూడా శిక్షణ ఇస్తున్నాం బాగానే ఉంది. అసలు మనిషికే ఈ మాత్రం ఇంగితం..బాధ్యత ఉంటే కాకులతో పనిచేయించుకోవాల్సిన పనే ఉండదు కదా..