PRASHAD Scheme: కేంద్ర ప్రభుత్వ “ప్రషాద్ పథకంలో” ఏపీ నుంచి 4 దేవస్థానాలు

ఏపీలోని అమరావతి, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం దేవస్థానాలకు "ప్రషాద్" పథకంలో స్థానం కల్పించినట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి తెలిపారు.

PRASHAD Scheme: కేంద్ర ప్రభుత్వ “ప్రషాద్ పథకంలో” ఏపీ నుంచి 4 దేవస్థానాలు

Tourist

PRASHAD Scheme: భారత్ లో హిందువులు పవిత్రంగా కొలిచే దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు గానూ.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పధకం “ప్రషాద్(PRASHAD)”. ఈ పధకం ద్వారా.. దేశంలోని పురాతన, ప్రముఖ దేవాలయాలను, పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి.. తద్వారా ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేందుకు కేంద్రం ఆచరణాత్మకంగా ఈ పధకాన్ని ప్రారంభించింది.

Also read: Adhaar PVC Card: ఆధార్ పీవీసీ కార్డుకి అప్లై చేసుకోనే విధానం

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు ప్రముఖ ప్రాంతాలను కేంద్ర పర్యాటకశాఖ ఈ పధకంలో చేర్చింది. ఏపీలోని అమరావతి, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం దేవస్థానాలకు “ప్రషాద్” పథకంలో స్థానం కల్పించినట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి తెలిపారు. గురువారం పార్లమెంటు సమావేశాల్లో భాగంగా బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ఆయా దర్శనీయ, పర్యాటక ప్రాంతాలను పథకంలో చేర్చినట్లు కేంద్ర మంత్రి వివరించారు.

Also read: Attack On TRS MLA : టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుపై గుడ్లతో దాడి

అమరావతిలో పర్యాటకాభివృధికి గానూ 2015-16 ఆర్ధిక సంవత్సరంలో రూ. 27.77 కోట్లతో అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేసినట్లు వివరించారు. శ్రీశైలం ఆలయాభివృద్ధి కోసం రూ. 37.88 కోట్ల ఖర్చు చేసినట్లు జీ.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తీర్థయాత్రలకు పునరుజ్జీవనం మరియు ఆధ్యాత్మికం, వారసత్వ సంపదను కాపాడుకోవడం అనే అంశాలను ఆధారంగా చేసుకుని కేంద్ర పర్యాటకశాఖ ఈ “ప్రషాద్(PRASHAD)”పధకాన్ని తీసుకువచ్చింది.

Also read: Pharma Companies: ఫార్మా కంపెనీల పొల్యూషన్‌పై NGT సీరియస్