Jayaprakash Narayana: తెలుగు నేల చూసిన అతి గొప్ప సీఎం ఆయనే- 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో జయప్రకాశ్ నారాయణ..

ఆరోజు సంజయ్ గాంధీని రాష్ట్రానికి తీసుకురావడం, పెద్ద ఊరేగింపులు, ఆడంబరం.. ఇవన్నీ మా అందరికి వెకిలిగా, అసహ్యంగా అనిపించాయి.

Jayaprakash Narayana: తెలుగు నేల చూసిన అతి గొప్ప సీఎం ఆయనే- 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో జయప్రకాశ్ నారాయణ..

Updated On : November 9, 2025 / 10:07 PM IST

Jayaprakash Narayana: 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ పాల్గొన్నారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. మీరు చూసిన ప్రముఖ ముఖ్యమంత్రుల్లో మీకు ఎవరు బెస్ట్ సీఎం అనిపించింది ఎవరు అన్న ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

‘మనం ప్రభుత్వం బయట ఉన్నప్పుడు ముఖ్యంగా యువకులుగా ఉద్యమాల్లో ఉన్నప్పుడు మన ఆలోచన ఒక రకంగా ఉంటుంది. వచ్చి చూశాక, వాస్తవాలు తెలిశాక మన ఆలోచన మరో రకంగా ఉంటుంది. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉండగా నేను విద్యార్థిని. ఎమర్జెన్సీలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను ఎమర్జెన్సీ ద్వేషిని. కాబట్టి నా దృష్టిలో ఆయన విలన్.

ఆరోజు సంజయ్ గాంధీని రాష్ట్రానికి తీసుకురావడం, పెద్ద ఊరేగింపులు, ఆడంబరం.. ఇవన్నీ మా అందరికి వెకిలిగా, అసహ్యంగా అనిపించాయి. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని బాధపడ్డా. కానీ, ఆ తర్వాత వెంగళరావు నాకు చాలా ఆప్తమిత్రుడు అయ్యారు. జాతీయ స్థాయిలో మంత్రిగా చేశారు, పీసీసీ అధ్యక్షులుగా చేశారు. ఆయన ఎంత అద్భుతమైన నాయకుడో పరిచయం నుంచి అనుభవం నుంచి నాకు తెలిసింది. నా దృష్టిలో తెలుగు నేల చూసిన అతి గొప్ప ముఖ్యమంత్రి జలగం వెంగళరావు.

అంత మందుచూపు, నేర్పరితనం, లక్ష్య సాధన, సమర్థమంతమైన వాళ్లను నమ్మి వారికి అధికారం, బాధ్యతలు అప్పగించడం, అజమాయిషీ చేయడం ఇవన్నీ ఆయన ప్రత్యేకతలు. మన రాష్ట్రానికి ఏం చేయాలి.. చనిపోయే దాకా ఇదే ఆయన తపన. ఆయన చనిపోవడానికి రెండు రోజుల ముందు ఆసుపత్రిలో రెండు గంటలు కూర్చున్నా. చనిపోవడానికి రెండు రోజుల ముందు కూడా మన రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్ కావాలి, మన రాష్ట్రంలో ఈ పని జరగాలి.. అదే తపన తప్ప మరొకటి లేదు. నా దృష్టిలో ఆయన నెంబర్ వన్ సీఎం” అని జయప్రకాశ్ నారాయణ అన్నారు.

Also Read: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు.. 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో జయప్రకాశ్ నారాయణ కీలక వ్యాఖ్యలు..