భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు అరెస్ట్.. అమెరికాలో ఒకరు, జార్జియాలో మరొకరు..

విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న దేశంలోని మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లలో ఇద్దరిని అరెస్ట్ చేయడంలో భారత భద్రతా సంస్థలు పెద్ద విజయాన్ని సాధించాయి.

భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు అరెస్ట్.. అమెరికాలో ఒకరు, జార్జియాలో మరొకరు..

Updated On : November 9, 2025 / 4:44 PM IST

Most Wanted Gangsters Arrested: వారిద్దరు భారత మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లు. ఇన్నాళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నారు. ఎట్టకేలకు విదేశాల్లో అరెస్ట్ అయ్యారు. అందులో ఒకడు భాను రాణా. ఇతడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ సభ్యుడు. అమెరికాలో రాణాను అదుపులోకి తీసుకున్నారు. ఇక మరొకడు వెంకటేశ్‌ గార్గ్. ఇతడు నందు గ్యాంగ్. వెంకటేశ్ ని జార్జియాలో అరెస్ట్ చేశారు. సెక్యూరిటీ ఏజెన్సీలు, హరియానా పోలీస్ శాఖ కలిసి ఈ ఇద్దరిని పట్టుకున్నాయి. భాను, వెంకటేశ్‌ను ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరిపై హరియానా, పంజాబ్, ఢిల్లీలో పదుల సంఖ్యలో క్రిమినల్ కేసులున్నాయి.

విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న దేశంలోని మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లలో ఇద్దరిని అరెస్ట్ చేయడంలో భారత భద్రతా సంస్థలు పెద్ద విజయాన్ని సాధించాయి. హర్యానా పోలీసులతో సహా భద్రతా సంస్థ అధికారులు జార్జియాలో వెంకటేశ్ గార్గ్‌ను అరెస్టు చేయగా, భాను రాణాను అమెరికాలో అరెస్ట్ చేశారు. రాణాకు లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో సంబంధం ఉంది.

గార్గ్, రాణా ఇద్దరినీ త్వరలో భారత్ కి తీసుకురానున్నారు. ప్రస్తుతం, ఇండియా నుండి 12మందికి పైగా ప్రధాన గ్యాంగ్‌స్టర్లు దేశం వెలుపల ఉన్నారు. వీరు అక్కడ రిక్రూట్ మెంట్స్ చేపడుతున్నారు. క్రిమినల్ సిండికేట్లు నడుపుతున్నారు.

గార్గ్, రాణాలను అరెస్ట్ చేయడానికి జరిపిన ఆపరేషన్‌లో ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల గురించి కీలకమైన సమాచారం తెలిసింది. గార్గ్ హర్యానాలోని నారాయణ్‌గఢ్ నివాసి. ప్రస్తుతం జార్జియాలో నివసిస్తున్న గార్గ్‌పై భారత్ లో 10కి పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అతను హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తర భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి యువతను నియమించుకునే వాడు.

గురుగ్రామ్‌లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నాయకుడి హత్యలో పాల్గొన్న తర్వాత అతను జార్జియాకు పారిపోయాడు. గార్గ్ ప్రస్తుతం విదేశాల్లో నివసిస్తున్న గ్యాంగ్‌స్టర్ కపిల్ సంగ్వాన్‌తో కలిసి దోపిడీ సిండికేట్‌ను నడుపుతున్నాడు. అక్టోబర్‌లో, ఢిల్లీ పోలీసులు సంగ్వాన్‌పై కాల్పులు జరిపిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరు ఒక బిల్డర్ ఇల్లు, ఫామ్‌హౌస్‌లో కాల్పులకు పాల్పడిన సంఘటనలో పాల్గొన్నారు.

బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న రాణా చాలా కాలంగా అమెరికాలో నివసిస్తున్నాడు. కర్నాల్ నివాసి రాణా చాలా కాలంగా నేర ప్రపంచంలో చురుగ్గా ఉన్నాడు. అతనిపై అనేక కేసులు నమోదయ్యాయి. రాణా నేర నెట్‌వర్క్ హర్యానా, పంజాబ్, ఢిల్లీ వరకు విస్తరించింది. పంజాబ్‌లో జరిగిన గ్రెనేడ్ దాడి దర్యాప్తులో అతని పేరు బయటపడింది. జూన్‌లో కర్నాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF).. హ్యాండ్ గ్రెనేడ్లు, పిస్టల్స్, మందుగుండు సామగ్రిని కలిగున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసింది. వారు రాణా ఆదేశాల మేరకు పని చేస్తున్నట్టు గుర్తించారు.

Also Read: PoKలో రచ్చ రచ్చ.. జెన్ జీ ఉద్యమం స్టార్ట్.. పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్న యువత