Naga Chaitanya: ముంబైలో అలా.. మా ముందు ఇలా.. భార్య గురించి నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్

అక్కినేని వారసుడు నాగ చైతన్య ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సమంతతో విడాకుల తరువాత(Naga Chaitanya) కొంతకాలం ఒంటరిగానే ఉన్న నాగ చైతన్య ఆ తరువాత నటి శోభితను రెండో పెళ్లి చేసుకున్నాడు.

Naga Chaitanya: ముంబైలో అలా.. మా ముందు ఇలా.. భార్య గురించి నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్

Naga Chaitanya makes interesting comments on his wife Shobhita

Updated On : November 9, 2025 / 8:07 PM IST

Naga Chaitanya: అక్కినేని వారసుడు నాగ చైతన్య ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సమంతతో(Naga Chaitanya) విడాకుల తరువాత కొంతకాలం ఒంటరిగానే ఉన్న నాగ చైతన్య ఆ తరువాత నటి శోభితను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి ఈ ఇద్దరు మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక వీలు చిక్కినప్పుడల్లా తన భార్య శోభిత గురించి ఎన్నో విషయాలను పంచుకుంటూ ఉంటాడు నాగ చైతన్య. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చై భార్య గురించి చేసిన కెమెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Amala Paul: పొట్టి నిక్కర్ లో అమలా పాల్ అందాల అరాచకం.. ఫోటోలు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. శోభితా ముంబైలో ఎంతో దూకుడుగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంది. కానీ, వైజాగ్ లోని తన ఇంటికి వచ్చినప్పుడు మాత్రం పల్లెటూరి పిల్లలా మారిపోతుంది. సాంప్రదాయాలను చాలా గౌరవిస్తుంది. తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. నాకు తెలుగు నేర్పించే టాలెంట్ ఉంది తనకు. ఆ విషయంలో తాను చాలా బెటర్” అంటూ భార్యపై ప్రశంసలు కురిపించాడు చైతన్య. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు నాగ చైతన్య.

ప్రస్తుతం ఈ హీరో విరూపాక్షతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు కార్తీక్ వర్మ దండుతో ఓ సినిమా చేస్తున్నాడు. హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.