Akash Choudhary: ఇదేం బాదుడు భయ్యా.. వరుసగా 8 సిక్సులు.. జస్ట్ 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. వీడియో చూస్తారా..

మెరుపు బ్యాటింగ్ తో ఆకాశ్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 2012లో లీస్టర్‌షైర్ తరఫున వేన్ వైట్ (12 బంతులు) ఎస్సెక్స్ పై నెలకొల్పిన ప్రపంచ రికార్డ్ ను బ్రేక్ చేశాడు.

Akash Choudhary: ఇదేం బాదుడు భయ్యా.. వరుసగా 8 సిక్సులు.. జస్ట్ 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. వీడియో చూస్తారా..

Updated On : November 9, 2025 / 7:46 PM IST

Akash Choudhary: వరుసగా 8 సిక్సులు.. జస్ట్ 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో భారత క్రికెటర్ వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. అతడే మేఘాలయకు చెందిన ఆకాశ్ చౌదరి (25). రంజీ ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో ఆకాశ్.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మెరుపు బ్యాటింగ్ చేశాడు. బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ క్రమంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు.

సూరత్ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతోంది. మేఘాలయ జట్టు స్కోర్ 576/6 వద్ద 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు ఆకాశ్. క్రీజులోకి వచ్చింది మొదలు.. విధ్వంసకర బ్యాటింగ్ ఆడాడు. అరుణాచల్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లిమర్ దాబీ వేసిన ఓవర్‌లో ఏకంగా 6 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత ఓవర్ తొలి రెండు బాల్స్ లోనూ సిక్సులు కొట్టాడు. అలా వరుసగా 8 సిక్సర్ల సాయంతో కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

మెరుపు బ్యాటింగ్ తో ఆకాశ్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 2012లో లీస్టర్‌షైర్ తరఫున వేన్ వైట్ (12 బంతులు) ఎస్సెక్స్ పై నెలకొల్పిన ప్రపంచ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. భారత్‌ తరపున ఇప్పటివరకు ఈ రికార్డ్ బందీప్ సింగ్ (15 బంతులు- 2015) పేరిట ఉండేది.

వెస్టిండీస్‌కు చెందిన లెజెండరీ సర్ గార్ ఫీల్డ్ సోబర్స్, భారత్ కు చెందిన రవిశాస్త్రి తర్వాత ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టిన మూడవ ఆటగాడిగా ఆకాశ్ నిలిచాడు. 1968 ఆగస్టులో నాటింగ్‌హామ్‌షైర్, గ్లామోర్గాన్ మధ్య జరిగిన కౌంటీ మ్యాచ్‌లో సోబర్స్ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్ల ఘనతను నమోదు చేసిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. 1984-85లో వాంఖడే స్టేడియంలో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో బరోడాపై బాంబే తరపున భారత మాజీ ఆల్ రౌండర్, ప్రధాన కోచ్ రవిశాస్త్రి.. తిలక్ రాజ్ బౌలింగ్‌లో వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు.

ఆకాశ్ చౌదరి 30 ఫస్ట్-క్లాస్ మ్యాచుల్లో 14.37 సగటుతో 2 హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. ఈ సంవత్సరం నార్త్ ఈస్ట్ జోన్ తరపున దులీప్ ట్రోఫీ కూడా ఆడాడు. 28 లిస్ట్-ఎ మ్యాచ్ లు, 20 టీ20 మ్యాచ్ లు కూడా ఆడాడు.

Also Read: RCB తరఫున బరిలోకి ట్రాన్స్ మహిళా క్రికెటర్..! సర్జరీ చేయించుకుని “ఆమె”గా మారిన “అతడు” ఎవరో కాదు..