లెస్బియన్‌ పార్ట్‌నర్‌తో కలిసి.. సొంత కుమారుడిని హత్య చేసిన మహిళ.. ఎందుకంటే?

అనుమానం రావడంతో భారతి ఫోన్‌ను తనిఖీ చేయగా, ఆమె తన పార్ట్‌నర్‌ సుమిత్రతో తీసుకున్న ఫొటోలు, వాయిస్‌ సందేశాలు సురేశ్‌కు కనిపించాయి.

లెస్బియన్‌ పార్ట్‌నర్‌తో కలిసి.. సొంత కుమారుడిని హత్య చేసిన మహిళ.. ఎందుకంటే?

Updated On : November 9, 2025 / 8:58 PM IST

Tamil Nadu: భారతి అనే ఓ లెస్బియన్‌ మహిళ.. రెండేళ్ల క్రితం ఓ పురుషుడిని పెళ్లి చేసుకుంది. అతడితో ఓ పిల్లాడిని కూడా కంది. అయితే, మూడేళ్ల క్రితం నుంచే ఆమెకు మరో లెస్బియన్‌తో సన్నిహిత సంబంధం ఉంది.

ఈ క్రమంలో సొంత కుమారుడిని భారతి తన లెస్బియన్‌ పార్ట్‌నర్‌తో కలిసి చంపేసింది. భారతి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలోని చిన్నాటి గ్రామంలో నవంబర్‌ 5న ఈ ఘటన జరిగింది. తల్లిపాలు తాగుతున్న సమయంలో తన ఐదు నెలల కుమారుడు స్పృహ తప్పాడని, ఆ శిశువును ఆసుపత్రికి తీసుకెళ్లామని భారతి భర్త సురేశ్ చెప్పాడు. తన కుమారుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని అన్నారు. (Tamil Nadu)

తన భార్య భారతి, ఆమె భాగస్వామి సుమిత్ర కలిసి తన కుమారుడిని చంపారని సురేశ్ పేర్కొన్నాడు. భారతి, సుమిత్రను పోలీసులు అరెస్టు చేశారు.

Also Read: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్‌ పూర్తి.. ఎంతమంది దొరికిపోయారంటే? ఇక ఆ డబ్బంతా బాధితులకు తిరిగి..

భార్య ఫోన్‌ చెక్‌ చేస్తే భర్తకు అంతా తెలిసిపోయింది..

ప్రాథమిక సమాచారం ప్రకారం శిశువు స్పృహ తప్పిన వెంటనే కెలమంగళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకురాకముందే ఆ పసివాడు మృతి చెందాడని డాక్టర్లు చెప్పడంతో.. సురేశ్ తన కుమారుడిని ఉద్దేశపూర్వకంగానే చంపిందని భారతి మీద ఆరోపణలు చేశాడు.

అనుమానం రావడంతో భారతి ఫోన్‌ను తనిఖీ చేయగా, ఆమె తన పార్ట్‌నర్‌ సుమిత్రతో తీసుకున్న ఫొటోలు, వాయిస్‌ సందేశాలు సురేశ్‌కు కనిపించాయి. ఈ వివరాలను పోలీసులకు సురేశ్ తెలిపాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారతి, సుమిత్ర గత మూడు సంవత్సరాలుగా సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. భారతికి కొడుకు పుట్టాక ఆమె సుమిత్రను కలవడం ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే శిశువును వారు హత్య చేసి ఉండొచ్చని తెలుస్తోంది. భారతి తన కుమారుడిని చంపిందని అంగీకరించిన ఓ ఫోన్‌ సంభాషణ రికార్డును కూడా పోలీసులకు సురేశ్ అందజేశాడు.