Ram Gopal Varma: శివ సినిమా చిరంజీవి చేసుంటే.. ప్రతీ సినిమాకు ఇలాగే అడుగుతారు.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్..
శివ.. తెలుగు సినిమా రూపురేఖలను మార్చేసిన సినిమా. అప్పటివరకు మూసధోరణిలో వెళుతున్న (Ram Gopal Varma)సినిమా ఇండస్ట్రీకి ఒక చేంజోవర్ తెచ్చిన సినిమా.
If Chiranjeevi did Shiva movie_ Ram Gopal Varma makes shocking comments
Ram Gopal Varma: శివ.. తెలుగు సినిమా రూపురేఖలను మార్చేసిన సినిమా. అప్పటివరకు మూసధోరణిలో వెళుతున్న సినిమా ఇండస్ట్రీకి ఒక చేంజోవర్ తెచ్చిన సినిమా. రియలిస్టిక్ అప్రోచ్ తో, చాలా సహజమైన(Ram Gopal Varma) సన్నివేశాలతో వచ్చిన ఈ సినిమా నిజంగా పాత్ బ్రేకర్ అనే చెప్పాలి. అంతెందుకు, తెలుగు సినిమా ఇండస్ట్రీని శివ సినిమాకి ముందు, శివ సినిమాకు తరువాత అని డివైడ్ చేస్తూ మాట్లాడతారంటే ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉండిఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
Naga Chaitanya: ముంబైలో అలా.. మా ముందు ఇలా.. భార్య గురించి నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్
ఆలాంటి సినిమా రాసినందుకు, ఆ సినిమా ఒప్పుకున్నందుకు రామ్ గోపాల్ వర్మ, నాగార్జున ఇద్దరు గ్రేట్ అనే చెప్పాలి. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా శివ సినిమా ఉండేది కాదు. అంతటి బ్లాక్ బస్టర్ సాధించిన ఈ సినిమాను ఇప్పుడు 4Kలో రీ రిలీజ్ కానుంది. ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
ఈ సందర్బంగా యాంకర్.. శివ సినిమా హిట్ తరువాత ‘చిరంజీవి’ మ్యాగజైన్‌లో ఈ సినిమా నాగార్జున కాకుండా చిరంజీవి చేస్తే ఎలా ఉండేది అనే శీర్షికతో ఓ స్టోరీ వచ్చింది. నేను ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా.. నిజంగానే చిరంజీవి శివ సినిమా చేసుంటే ఎలా ఉండేదో చెప్పండి అని అడిగాడు. దానికి సమాధానంగా ఆర్జీవీ.. అప్పుడే కాదు ఇప్పుడు కూడా చాలా సినిమాలు హిట్ అయినప్పుడు ఇదే సినిమాను పెద్ద హీరోతో చేస్తే ఎలా ఉండేది అని అడుగుతూ ఉంటారు. శివ అనే పాత్రకు నాగార్జున సెట్ అయ్యాడు కాబట్టే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అదే సినిమా చిరంజీవి చేసుంటే ఎలా ఉండేదో చెప్పలేం” అంటూ చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. దీంతో ఆయన చేసిన ,కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
