Extreme Temperatures : మెక్సికోలో మండుతున్న ఎండలతో 112 మంది మృతి

మండుతున్న ఎండలతో ఈ ఏడాది మెక్సికో దేశంలో మార్చి నుంచి ఇప్పటివరకు 112 మంది మరణించారు. భగ భగ మండే ఎండలతో మెక్సికోలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవడంతో వడదెబ్బతో 112 మంది మరణించారని మెక్సికో హెల్త్ సెక్రటేరియెట్ శుక్రవారం వెల్లడించింది....

Extreme Temperatures : మండుతున్న ఎండలతో ఈ ఏడాది మెక్సికో దేశంలో మార్చి నుంచి ఇప్పటివరకు 112 మంది మరణించారు. భగ భగ మండే ఎండలతో మెక్సికోలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవడంతో వడదెబ్బతో 112 మంది మరణించారని మెక్సికో హెల్త్ సెక్రటేరియెట్ శుక్రవారం వెల్లడించింది. మెక్సికో దేశంలోని న్యూవో లీన్ రాష్ట్రంల అత్యధికంగా 64 మంది మరణించారని హెల్త్ సెక్రటేరియెట్ తెలిపింది. టాములీపాస్ రాష్ట్రంలో 19 మంది, వెరాక్రూజ్ ప్రాంతంలో 15 మంది మరణించారు.

Delhi University: మోదీ పర్యటన సందర్భంగా విద్యార్థులు నల్లరంగు దుస్తులు ధరించవద్దు

టాబాస్కోలో ఐదుగురు, క్వింటానా రో, సోనోరా, కాంపిచ్ ప్రాంతాల్లోనూ జనం మండే ఎండల ధాటికి మృత్యువాత పడ్డారు. అధిక ఉష్ణోగ్రతతో 1559 మంది ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందారు. టామూలీపాస్ రాష్ట్రంలో భానుడి సూర్యప్రతాపానికి 19 మంది మరణించారని ఆ రాష్ట్ర గవర్నర్ అమెరికో విల్లార్రీల్ అనయా చెప్పారు. మండుతున్న ఎండల బారి నుంచి రక్షించుకునేందుకు ప్రజలు చల్లటి గదుల్లో వెంటిలేషన్ ఉన్న ప్రాంతాల్లో ఉండాలని టామూలీపాస్ హెల్త్ సెక్రటరీ కోరారు.

Mumbai Local Train : ముంబయి లోకల్ రైలులో మహిళపై లైంగిక వేధింపులు

మెక్సికో, దక్షిణ యూఎస్ రాష్ట్రాల్లో నమోదైన అధిక ఉష్ణోగ్రతలు ప్రజలను అల్లాడిస్తున్నాయి. సూర్యప్రతాపంతో ప్రజలు వడదెబ్బకు గురై మరణిస్తున్నారు. విపరీతమైన ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో వృద్ధులు, పిల్లలు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని మెక్సికో ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. జూన్ నెలలో వేడి వాతావరణం వల్ల వేడి తరంగాలు వీస్తున్నాయి. దీంతో ఉక్కపోత పరిస్థితులు నెలకొన్నాయి. హీట్ వేవ్ వల్ల వడదెబ్బకు గురై ప్రజలు మరణిస్తున్నారని మెక్సికో వైద్యులు చెపుతున్నారు.

Ration Cards : పేదలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త రేషన్ కార్డులు, దేశంలోనే తొలిసారిగా

గత మూడు సంవత్సరాల్లో నమోదైన వాటి కంటే ఈ సంవత్సరం అధిక ఉష్ణోగ్రత వల్ల మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. మెక్సికోలోని నేషనల్ అటానమస్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు,పరిశోధకులు జులై నెల ప్రారంభంలో నాల్గవ హీట్ వేవ్ మెక్సికో దేశాన్ని తాకవచ్చని చెప్పారు. మెక్సికోలోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవువతుండటంతో ప్రజలు ఉక్కపోత, డీహైడ్రేషన్ తో అల్లాడుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు