Bill Gates Daughter : కరోనా నిబంధనల మధ్య ‘బిల్‌ గేట్స్‌’ కుమార్తె వివాహం.. ఖర్చు ఎంతంటే

బిలియనీర్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అతని మాజీ భార్య మిలిందా గేట్స్ పెద్ద కుమార్తె, జెన్నిఫర్ కాథరిన్ గేట్స్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది

Bill Gates Daughter : బిలియనీర్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అతని మాజీ భార్య మిలిందా గేట్స్ పెద్ద కుమార్తె, జెన్నిఫర్ కాథరిన్ గేట్స్ వివాహం ఆమె ప్రియుడు నాయెల్‌ నాజర్‌‌తో అంగరంగ వైభవంగా జరిగింది. గతేడాది జనవరిలో తనకు కాబోయే భర్త ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది జెన్నిఫర్ కాథరిన్. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన వీరి వివాహం అక్టోబర్ 16న జరిగింది. ఈ వివాహ వేడుకకు బిల్ గేట్స్, మిలిందా గేట్స్ హాజరయ్యారు.

నాయెల్‌ నాజర్‌, జెన్నీఫర్‌ గేట్స్‌ ప్రేమ

స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో జెన్నీఫర్‌ గేట్స్‌, నాయెల్‌ నాజర్‌ కలిసి చదువుకున్నారు. అదే సమయంలో ఇరువురు ప్రేమించుకున్నారు. ఇక వీరి ప్రేమ విషయాన్ని 2017 బహిర్గతం చేశారు. వీరి ప్రేమకు బిల్‌గేట్స్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

చదవండి : Bill Gates : బెజోస్,మస్క్ కి “బిల్ గేట్స్” ఘాటు మెసేజ్

చికాగోలో జన్మించిన నాయెల్‌ నాజర్‌ కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యాడు. ఇతడికి గుర్రపు స్వారీలో మంచి ప్రావిణ్యం ఉంది. 2013, 2014, 2017లో అంతర్జాతీయ ఈక్వెస్ట్రియన్ క్రీడలకు అర్హత సాధించారు. ఇతడు తాజాగా జరిగిన ఒలింపిక్స్ విశ్వక్రీడల్లో కూడా పాల్గొన్నారు. ఇక LLC అనే కంపెనీ నడుపుతున్నాడు. నాయెల్‌ నాజర్‌ కూడా సంపన్నుడే.

చదవండి : Bill Gates – Jeff Bezos: మూడేళ్లుగా ఆ కంపెనీలో బిల్ గేట్స్.. జెఫ్ బెజోస్ పెట్టుబడులు

పెళ్లిపై మాట్లాడిన జెన్నిఫర్ కాథరిన్

శనివారం మధ్యాహ్నం న్యూయార్క్‌లోని ఉత్తర సేలంలోని కుటుంబానికి చెందిన 142 ఎకరాల ఎస్టేట్‌లో బహిరంగ వివాహ వేడుక జరిగింది. పెళ్లికి ఇరు కుటుంబాల సన్నిహితులను మాత్రమే పిలవాలని భావించాం. అలా చూసుకున్న 300 మంది లిస్ట్‌ తయారయ్యింది. ఇక వారందరిని టీకా సర్టిఫికేట్‌ తప్పనిసరి చేశాం. నెగిటివ్‌ రిపోర్ట్‌ తీసుకురావాల్సిందిగా సూచించాం. పెళ్లి సందర్భంగా వారాంతంలో రెండు వివాహ వేడుకలు నిర్వహించాం. ఒకటి సివిల్‌ మరొకటి మతపరమైనది’’ అని తెలిపింది.

చదవండి : Bill Gates: టోక్యో ఒలంపిక్స్‌ ఫైనల్‌లో బిల్‌గేట్స్‌కి కాబోయే అల్లుడు

వివాహ ఖర్చు

బిల్‌గేట్స్‌ కుమార్తె వివాహ వేడుకకు కేవలం 2 మిలియన్‌ డాలర్లు అనగా 14 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయట. ఇంత తక్కువ ఎందుకంటే.. కరోనా. ఈ మహమ్మారి కారణంగా కంపెనీ ఉద్యోగులను కానీ.. సన్నిహితులకు కానీ ఆహ్వానం ఇవ్వలేదు.. దీంతో చాలా తక్కువ ఖర్చుతోనే పెళ్లి తంతు పూర్తైంది.

ట్రెండింగ్ వార్తలు