Bill Gates : బెజోస్,మస్క్ కి “బిల్ గేట్స్” ఘాటు మెసేజ్

అంతరిక్ష యాత్రలతో స్పేస్‌ టూరిజంను అభివృద్ధి చేయాలనే ఉద్ధేశ్యంతో అడుగులు వేస్తున్న ప్రపంచంలో నెం.1,నెం.2 ధనవంతులుగా ఉన్న స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌,అమెజాన్‌ అధినేత జెఫ్‌

Bill Gates : బెజోస్,మస్క్ కి “బిల్ గేట్స్” ఘాటు మెసేజ్

Billgates

Bill Gates అంతరిక్ష యాత్రలతో స్పేస్‌ టూరిజంను అభివృద్ధి చేయాలనే ఉద్ధేశ్యంతో అడుగులు వేస్తున్న ప్రపంచంలో నెం.1,నెం.2 ధనవంతులుగా ఉన్న స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌,అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌పై మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ముఖ్యమైన మెసేజ్ ఇచ్చారు. గత కొన్ని రోజుల క్రితం వర్జిన్‌ గెలాక్టిక్‌, బ్లూ ఆరిజిన్‌, స్పేస్‌ ఎక్స్‌ సంస్థలు ప్రైవేటు వ్యక్తుల రోదసి యాత్రలను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సంస్థల అధినేతలు స్పేస్‌ టూరిజంను అభివృద్ధి చేయాలనే ఉద్ధేశ్యంతో అడుగులు వేస్తున్నారు. కాగా, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఈ ఏడాది జూలైలో బ్లూ ఆరిజన్ రాకెట్ అంతరిక్షానికి వెళ్లివచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా మస్క్ కి చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీ..అంతరిక్ష ప్రయాణ అంశంలో బిజీగా ఉంది.

ఈ సమయంలో తాజాగా లేట్‌ లేట్‌ షో విత్‌ జేమ్స్‌ కోర్డాన్‌ షోలో పాల్గొన్న బిల్‌గేట్స్‌ ని భూగ్రహాన్ని వదిలిపెట్టి ఎప్పుడు ఇతర గ్రహాలకు వెళ్దామనే తపన మీలో లేదని బిల్‌గేట్స్‌ను ఉద్దేశించి షో వ్యాఖ్యత జేమ్స్‌ కోర్డాన్‌ పేర్కొన్నారు. దీనికి బిల్‌ గేట్స్‌ సమాధానమిస్తూ… భూమ్మీద మనం ఎన్నో సమస్యలతో సతమతమౌతుంటే…రోదసీ యాత్రలపై దృష్టి పెట్టడం సరికాదన్నారు. మలేరియా, హెచ్‌ఐవీ లాంటి వ్యాధులుఇంకా అంతంకాలేదు. నాకు వాటిని భూమ్మీద నుంచి ఎప్పుడు రూపుమాపుతామనే భావన నన్ను ఎప్పుడు వేధిస్తూనే ఉంది. ఈ సమయంలో స్పేస్‌ టూరిజంపై దృష్టిపెట్టడం సరికాదంటూ ఎలన్ మస్క్,జెఫ్ బెజోస్ లకు ఓ మెసేజ్ ఇచ్చారు.

తాను కాక్టెయిల్ పార్టీలలో డిసీజస్ గురించి మాట్లాడి ప్రజలకు బోర్ కొట్టిస్తున్నానేమో అని బిల్ గేట్స్ అన్నారు.  కాగా, ప్రజారోగ్యంలో పని చేయడంలో గేట్స్ ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి ఆయన వ్యాఖ్యలు నిజంగా ఆశ్చర్యం కలిగించవనే చెప్పవచ్చు. ప్రపంచంలో నెం.1,నెం.2 ధనవంతులుగా ఉన్న ఎలన్ మస్క్ మరియు బెజోస్ ఇద్దరూ అంతరిక్ష టూరిజంపై చాలా గట్టి నమ్మకం ఉంచి పని చేస్తున్నారు. కాగా, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఈ ఏడాది జూలైలో బ్లూ ఆరిజన్ రాకెట్ అంతరిక్షానికి వెళ్లివచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా మస్క్ కి చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీ..అంతరిక్ష ప్రయాణ అంశంలో బిజీగా ఉంది.