Middle East War: అన్నంత పని చేసిన ట్రంప్.. ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించిన అమెరికా

ఇరాన్ ఓడరేవుల్లోకి వచ్చిపోయే నౌకలను అడ్డుకుంటున్నాయి యూఎస్ దళాలు.

  • Published On : April 13, 2026 / 08:30 PM IST

Middle East War: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేశారు. ఇరాన్ కు చెందిన ఓడరేవుల దిగ్బంధనం మొదలు పెట్టారు. అమెరికా నౌకాదళం ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించింది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ తెరవకపోవడంతో అమెరికా ప్రతిచర్యకు దిగింది. ట్రంప్ ఆదేశాలతో అమెరికా నౌకాదళం భారీగా బలగాలను దింపింది. ఇరాన్ ఓడరేవుల్లోకి వచ్చిపోయే నౌకలను అడ్డుకుంటున్నాయి యూఎస్ దళాలు. ఏ దేశమైనా సరే తమ అనుమతులు తీసుకోవాల్సిందేనని అమెరికా తేల్చి చెప్పింది.

ఓడరేవుల దిగ్బంధంపై ఇరాన్ సీరియస్ అయ్యింది. అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. తమ పోర్టులను దిగ్బంధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది ఇరాన్. తమ ఓడరేవులకు ముప్పు వాటిల్లితే తీవ్రంగా స్పందిస్తామని ఇరాన్ చెప్పింది. పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలోని ఓడరేవులను ధ్వంసం చేస్తామని ప్రకటించింది.

ఇరాన్ ఇప్పటిదాకా ఏదైతే వ్యూహం అమలు చేసింది.. అమెరికా ఇప్పుడు అదే వ్యూహాన్ని ఇరాన్ పై ప్రయోగిస్తోంది. హర్మూజ్ జలసంధిని మూసేసి అటు ఇరాన్, ఇటు చైనా.. రెండు దేశాలకు షాక్ ఇస్తోంది. దీంతో ఇప్పటివరకు హర్మూజ్ ఇరాన్ కంట్రోల్ లో ఉండగా సోమవారం సాయంత్రం నుంచి సీన్ మారిపోయింది. దీని పర్యవసానాలు ఎలా ఎన్నా గల్ఫ్ వార్ లో కాల్పుల విరమణ ఒట్టిదే అని తేలిపోయింది.

హర్మూజ్ జలసంధిలో ఇక ఇరాన్ కు వెళ్లే నౌకలు, ఇరాన్ నుంచి వచ్చే నౌకలను అడ్డుకుంటామని ప్రకటించింది అమెరికా. దీంతో ఇతర దేశాలకు కూడా చిక్కులు వస్తాయేమో అనే అనుమానాలు వ్యక్తం కాగా ఈ బ్లాకేడ్ కేవలం ఇరాన్ కి రాకపోకలు సాగించే దేశాలపైనే అని ట్రంప్ స్పష్టంగా చెప్పారు. దీంతో ఇరాన్ మినహా ఇతర దేశాలకు వెళ్లే నౌకలు హర్మూజ్ జలసంధి మీదుగా స్వేచ్చగా ప్రయాణించొచ్చు. అయితే ఇది చెప్పినంత ఈజీగా కాదు. తమ నౌకలను నిర్బంధిస్తే తామూ ప్రతీకారానికి దిగడానికి రెడీ అంటోంది ఇరాన్.

Also Read: పశ్చిమాసియాలో మళ్లీ టెన్షన్.. ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈసారి మరిన్ని ఇబ్బందులు..! వాటి ధరలు భారీగా పెరిగే చాన్స్..