12 Years Old Jampala: వయసు 12 ఏళ్లు.. మూడు దేశాల్లో AI కంపెనీలు.. ఈ పాప గురించి తెలిస్తే షాక్ అవుతారు!
జంపాల(12 Years Old Jampala) అనే బాలిక ఈ చిన్న వయసులోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్‌ను విజయవంతంగా నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
A 12 year old Jampala has launched Voxa AI services in three countries.
- పన్నెండేళ్లకే ఏఐ స్టార్టప్
- మూడు దేశాల్లో సేవలు
- వోక్సా ఏఐ రిసెప్షనిస్ట్
12 Years Old Jampala: సాధారణంగా పన్నెండేళ్ల వయసులో పిల్లలు పాఠశాల చదువులు, ఆటపాటలతో బిజీగా ఉంటారు. కానీ, ఏడో తరగతి చదువుతున్న జంపాల అనే బాలిక మాత్రం ఈ చిన్న వయసులోనే అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్‌ను విజయవంతంగా నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తొమ్మిదేళ్ల ప్రాయంలోనే కోడింగ్ మరియు పైథాన్ నేర్చుకున్న ఈ టెక్ మేధావి, 11 ఏళ్లకే(12 Years Old Jampala) ఏఐ ప్రొడక్ట్స్ బిల్డ్ చేయడం ప్రారంభించింది.
‘వోక్సా’ సరికొత్త ఏఐ రిసెప్షనిస్ట్:
తన తండ్రి కార్యాలయంలో కస్టమర్ కాల్స్ మిస్ అవ్వడం వల్ల వ్యాపార అవకాశాలు దెబ్బతినడాన్ని గమనించిన జంపాల, దానికి పరిష్కారంగా Voxa అనే ఏఐ-పవర్డ్ వాయిస్ అసిస్టెంట్‌ను రూపొందించింది. ఈ వర్చువల్ రిసెప్షనిస్ట్ వ్యాపార సంస్థల తరఫున 24 గంటలూ అందుబాటులో ఉంటూ కాల్స్‌కు సమాధానాలు ఇవ్వడం, అపాయింట్మెంట్లు బుక్ చేయడం, ఆర్డర్లు సేకరించడం వంటి పనులను ఆటోమేట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫాం ఇండియా, కెనడా, కంబోడియా దేశాల్లోని పలు రెస్టారెంట్లు, ఫార్మసీలలో విస్తృతంగా ఉపయోగపడుతోంది.
సాంకేతిక నైపుణ్యం – భవిష్యత్తు లక్ష్యాలు:
జంపాల కేవలం చాట్‌జీపీటీ, క్లాడ్ వంటి ఏఐ టూల్స్‌పైనే పూర్తిగా ఆధారపడకుండా, స్వయంగా కోడ్ స్నిప్పెట్లను టెస్ట్ చేస్తూ, బగ్స్‌ను ఫిక్స్ చేస్తూ బ్యాకెండ్ను బలంగా నిర్మించింది. దీని ద్వారా ‘వోక్సా ఏజెంట్స్’ అనే సరికొత్త ఫీచర్‌ను తెచ్చింది, ఇది సాధారణ ఇంగ్లీష్ ఆదేశాలతోనే ఆటోమేటిక్ ఏఐ టాస్క్‌లను పూర్తి చేస్తుంది. భారతీయ కాలేజియట్ లెవల్ సైన్స్ పోటీల్లో స్పెషల్ ప్రైజ్, అలాగే ప్రసిద్ధ ‘1517 ఫండ్ మెడిసి ప్రాజెక్ట్’ నుండి గ్రాంట్ అందుకున్న ఈ బాలిక, భవిష్యత్తులో టాప్ స్టార్టప్ యాక్సలరేటర్లో చేరి తన వ్యాపారాన్ని మరింత స్కేల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిజీ లైఫ్‌లోనూ ఆమె ఫుట్‌బాల్ ఆడటం, స్నేహితులతో గడపడం మర్చిపోకపోవడం విశేషం.
