Migrant boat
Migrant boat: ఇటలీలో సముద్ర తీరంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ పడవ మునిగి దాదాపు 40 మంది మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 100 మంది శరణార్థులతో వెళ్తున్న పడవ ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఒక్కసారిగా మునిగిపోయిందని అధికారులు చెప్పారు.
ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారని వివరించారు. ఇప్పటివరకు దాదాపు 40 మంది మృతదేహాలను బయటకు తీసుకువచ్చినట్లు చెప్పారు. కాలాబ్రియాలోని క్రోటన్ నగరారినికి సమీపంలో సముద్రంలో ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు. సహాయక చర్యల్లో తీర ప్రాంత రక్షణ సిబ్బంది, బార్డర్ పోలీస్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు.
సముద్రం నుంచి దాదాపు 40 మందికి కాపాడినట్లు సహాయక సిబ్బంది అంటున్నారు. యూరప్ లో ఆశ్రయం కోసం శరణార్థులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. చాలా ప్రమాదకర ప్రదేశాల నుంచి వారు అక్రమంగా యూరప్ లోకి ప్రవేశించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
Nikki Haley: శతృ దేశాలకు సాయం నిలిపివేస్తాం.. పాక్, చైనాలకు కూడా: నిక్కీ హేలీ