Miss Universe: ఆండ్రియా మెజా.. 69వ మిస్ యూనివర్స్‌గా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

మెక్సికోకు చెందిన ఆండ్రియా మెజా 69వ మిస్ యూనివర్స్ గా కిరీటం దక్కించుకుంది. ఆ హోదా కోసం దశల వారీగా పెట్టిన పరీక్షల్లో గెలిచిన ఆమె చివరిగా అడిగిన ప్రశ్నకు చాకచక్యంగా సమాధానమిచ్చింది.

Miss Universe: ఆండ్రియా మెజా.. 69వ మిస్ యూనివర్స్‌గా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

Miss Universe

Updated On : May 17, 2021 / 8:29 PM IST

Miss Universe: మెక్సికోకు చెందిన ఆండ్రియా మెజా 69వ మిస్ యూనివర్స్ గా కిరీటం దక్కించుకుంది. ఆ హోదా కోసం దశల వారీగా పెట్టిన పరీక్షల్లో గెలిచిన ఆమె చివరిగా అడిగిన ప్రశ్నకు చాకచక్యంగా సమాధానమిచ్చింది.

‘మీరే దేశానికి నాయకులైతే కొవిడ్ మహమ్మారిని ఎలా హ్యాండిల్ చేస్తారు’ ? అని ప్రశ్న అడిగారు. దానికి రెస్పాన్స్ ఇచ్చిన ఆండ్రియా.. ‘ఇలాంటి (కొవిడ్-19) కఠిన పరిస్థితిని హ్యాండిల్ చేయడానికి నిర్ధిష్టమైన మార్గం ఏదీ లేదు. నేను నమ్మేది ఏంటంటే.. ప్రమాదం ముంచుకొచ్చేంత వరకూ చూడకుండా ముందుగానే లాక్ డౌన్ విధిస్తాను. అలా చాలా ప్రాణాలు కాపాడగలుగుతాం. అని చెప్పింది.

1994 ఆగష్టు 13న పుట్టిన ఈమె చిహువా అటానమస్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేషన్ బ్యాచ్ లర్ డిగ్రీ పూర్తి చేసి.. మెక్సికానా యూనివర్సల్ 2020 కిరీటాన్ని దక్కించుకున్నారు. మిస్ మెక్సికో 2017 కిరీటం అందుకోవడమే కాకుండా, మిస్ వరల్డ్ 2017లో రెండో నిలిచారు. అంతేకాకుండా చిహువాహువా టూరిజం బ్రాండ్ అంబాసిడర్ కూడా.