Jaranwala: దైవదూషణ చేశారంటూ పాక్‌లో చర్చిలు, క్రైస్తవుల ఇళ్లను తగులబెట్టిన వైనం.. 100 మంది అరెస్ట్

పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రభుత్వం అల్లర్లు మరింత పెరగకుండా ఉండడానికి పెద్ద ఎత్తున పోలీసులను రంగంలోకి దింపింది.

Pakistan

Jaranwala – Pakistan : పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ఫైసలాబాద్ జిల్లా(Faisalabad District)లో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు 24 గంటల్లో 600 మందిపై టెర్రర్ కేసులు నమోదు చేశారు. ఫైసలాబాద్ జిల్లాలోని జరన్‌ వాలాలో దుండగులు చర్చిలపై దాడులకు తెగబడ్డారు.

క్రైస్తవుల ఇళ్లు, చర్చిలను తగులబెడుతూ బీభత్సం సృష్టించారు. ఓ క్రైస్తవుడు, అతని సోదరి ఖురాన్‌ ను అపవిత్రం చేయడం, దైవదూషణకు కూడా పాల్పడ్డారన్న ప్రచారంతో ఈ భీకర దాడులు జరిగాయి. దాదాపు అయిదు చర్చిలకు ముస్లిం వర్గానికి చెందిన కొందరు నిప్పు పెట్టారు. అక్కడ నిన్నటి నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పాకిస్థాన్ రేంజర్లు మోహరించారు.

పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రభుత్వం అల్లర్లు మరింత పెరగకుండా ఉండడానికి పెద్ద ఎత్తున పోలీసులను రంగంలోకి దింపింది. ఏడు రోజుల పాటు పోలీసులు 144 సెక్షన్ విధించారు. అన్ని రకాల సమావేశాలపై తాత్కాలికంగా నిషేధం విధించారు.

ఘర్షణలపై ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. పాకిస్థాన్ లో దైవదూషణ చేస్తే చట్టపరంగా శిక్షలు ఉంటాయి. ఆయుధాలతో వందలాది మంది కొన్ని చర్చిలను ధ్వంసం చేస్తూ, వాటికి నిప్పంటిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Mumbai : కాఫీ బార్ యువకుడి ఆశయం చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెబుతున్న కస్టమర్లు

ట్రెండింగ్ వార్తలు