Pornography Photo Shoot : విమానాశ్రయంలో పోర్న్ వీడియోల చిత్రీకరణ.. మోడల్‌కు 18 ఏళ్ల జైలు శిక్ష

కొన్ని దేశాల్లో పోర్న్ వీడియోలు తీయడం, చూడటం నేరం. పోర్న్‌పై ఆంక్షలున్న దేశానికి వెళ్లి ఫోజులిచ్చిన ఓ మోడల్‌కు 18 ఏళ్లవరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Pornography Photo Shoot

Pornography Photo Shoot : కొన్ని దేశాల్లో పోర్న్ వీడియోలు తీయడం, చూడటం నేరం. పోర్న్‌పై ఆంక్షలున్న దేశానికి వెళ్లి ఫోజులిచ్చిన ఓ మోడల్‌కు 18 ఏళ్లవరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాలోని జావా విమానాశ్రయం పార్కింగ్ స్థలంలో అశ్లీల ఫొటో షూట్‌కు సిస్కై అనే మోడల్‌ బట్టలు విప్పి, ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

చదవండి : Porn Link : 5వ తరగతి విద్యార్థుల వాట్సాప్ గ్రూప్‌లో పోర్న్ లింక్ పెట్టిన టీచర్

పోస్ట్ చేసిన కొద్దీ నిమిషాల్లోనే లక్షల వ్యూస్ వచ్చిపడ్డాయి. దీంతో అక్కడివారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ ఉన్న సీసీటీవీలలో దృశ్యాలను పరిశీలించారు. ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో మోడల్ ఈ విధంగా ప్రవర్తించడంపై ఆగ్రహించిన అక్కడి అధికారులు కేసు నమోదు చేశారు. పూర్తి ఆధారాలు సేకరించి జావాలోని బాండుంగ్ సిటీలో సిస్కైని అరెస్టు చేశారు.

చదవండి : Child Pornography: చైల్డ్‌ పోర్నోగ్రఫీపై సీబీఐ ఫోకస్‌.. దేశవ్యాప్తంగా అరెస్ట్‌లు.. చూసినా నేరమే!

అక్కడి చట్టాల ప్రకారం.. సదరు మహిళకు 18 ఏళ్లవరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో స్థానిక పోలీసు చీఫ్ ముహ్రొమా ఫజ్రినీ మాట్లాడుతూ.. ‘ఈ వీడియోను మూడు నెలల క్రితం చిత్రీకరించినట్లు తెలిపారు. ఆమె కేవలం ఫోటో షూట్ కోసమే విమానాశ్రయానికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.పోర్నోగ్రఫీ చట్టం, ఐటీఈ చట్టాలను ఉల్లంఘించిన ఆరోపణలపై మోడల్‌ను అరెస్టు చేయడం జరిగిందని’ వెల్లడించారు.