బిడ్డ ఏడవకుండా ఉండటానికి కటౌట్లు తయారు చేయించిన అమ్మ

  • Publish Date - December 14, 2019 / 09:50 AM IST

బిడ్డ ఏడవకుండా ఓ అమ్మ ఉండటానికి ఓ టెక్నిక్ కనిపెట్టింది. పెద్ద పెద్ద కటౌట్ల తయారు చేయిస్తోంది. ఇదేంటి పిల్లలు ఏడవకుండా ఉండటానికి ఆటవస్తువులు..బొమ్మలు కొనిస్తారు గానీ కటౌట్లు తయారు చేయించటమేంటో..ఆ తల్లి తెలివితేటలేంటో తెలుసుకుందాం..

చిన్నారులు అమ్మ కనిపించకపోతే ఆందోళన పడతారు. భయపడతారు. అమ్మ కోసం ఏడుస్తారు. నాన్న కనిపించకపోయినా ఫరవాలేదు కానీ అమ్మ తల్లి కనిపించకపోతే ఏడుస్తారు. అలా ఏడ్చేపిల్లలు అమ్మ కనిపించగానే ఏడుపు ఆపేసి నవ్వుతారు. తల్లి,బిడ్డల మధ్య ఆ అనుబంధం అటువంటింది. అలా తను కనిపించనప్పుడు బిడ్డ ఏడవకూడదని ఓ తల్లి ఓ ఐడియా వేసింది. అదే పెద్ద కటౌట్లు తయారు చేయించింది. 

జపాన్‌కు చెందిన ఓ మహిళకు ఏడాదిన్నర పిల్లాడున్నాడు. అమ్మను విడిచి అసలు ఉండడు. దీంతో తల్లిదండ్రులు రెండు కటౌట్లకు ఆర్డర్ చేశారు. ఒకటి తల్లి నిలబడి ఉన్నట్లుగా..మరొకటి అమ్మ కూర్చున్నట్లు తయారు చేయించారు. కూర్చొన్న కటౌట్‌ను హాల్‌లోనూ…నిలబడి ఉన్న కటౌట్‌ను కిచెన్‌లో పెట్టి తల్లి వేరే పనులు చేసుకుంటోంది. ఆ కటౌట్లు చూసి ఆ పిల్లాడు నిజంగా అమ్మ అక్కడే ఉందని అనుకుంటున్నాడు. చక్కగా ఆడుకుంటున్నాడు.చక్కగా బొమ్మలతో ఆడుకుంటున్నాడు. ఒక 20 నిమిషాల వరకు ఆ బిడ్డ తన తల్లిని కటౌట్ల రూపంలో చూసి ఏడవకుండా ఆడుకుంటున్నాడు. అమ్మ తనదగ్గరే ఉందని ఫీలవుతున్నాడు. ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.