Monkeypox Virus : విజృంభిస్తున్న మంకీపాక్స్‌.. 14దేశాల్లో పాకిన వైరస్.. 100కిపైగా కేసులు..!

Monkeypox Virus :  మంకీపాక్స్‌తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఆఫ్రికన్‌ దేశాల్లో బయటపడిన మంకీపాక్స్‌ వైరస్‌ వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాప్తిస్తోంది.

Monkeypox Virus :  మంకీపాక్స్‌తో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఆఫ్రికన్‌ దేశాల్లో బయటపడిన మంకీపాక్స్‌ వైరస్‌ వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాప్తిస్తోంది. ఇప్పటి వరకు 13 దేశాల్లో 100 కేసులకుపైగా గుర్తించారు. ఇందులో 90కి పైగా కేసులు అధికారికంగా నిర్ధారించారు.. మరికొన్ని అనుమానిత కేసులను పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌తో పాటు.. యూరప్‌ దేశాల్లో వైరస్‌ను గుర్తించారు. ఈ దేశాల్లో ప్రయాణించి వచ్చిన వారితో పాటు ప్రయాణించని వారికి కూడా వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌పై అత్యవసర సమావేశం నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచ దేశాలన్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మంకీపాక్స్‌ కేసులు పెరుగుతుండటంతో బెల్జియంలో క్వారంటైన్ తప్పనిసరి చేశారు. బెల్జియంలో ఇప్పటివరకూ 14 కేసులు నమోదయ్యాయి.

అన్ట్‌వెర్ప్‌లో మొదటిసారిగా మంకీపాక్స్‌ కేసు నమోదైంది. ఇప్పటివరకూ నమోదైన అన్ని మంకీపాక్స్ కేసులు అక్కడ బాధితులే ఉన్నారు. ఇటీవల అన్ట్‌వెర్ప్‌లో జరిగిన ఓ వేడుకకు వీరంతా హాజరయ్యారని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మంకీపాక్స్ వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కరోనావైరస్ తరహాలోనే మంకీపాక్స్ పాజిటివ్‌ వచ్చినవారికి 21 రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరి చేస్తోంది. పాజిటివ్ వచ్చిన నిబంధనలు తప్పక పాటించాలని ఆదేశించింది. బాధితులు మూడు వారాలు ఐసొలేట్ కావాలని బెల్జియం ఆదేశించింది.

Monkeypox Spreads To 14 Countries; Compulsory Quarantine In Belgium

మరోవైపు మంకీపాక్స్ కేసులు ఎక్కువగా నమోదైన దేశంగా బ్రిటన్ కాగా.. అక్కడ ఇప్పటివరకూ 20మందికి పైగా మంకీపాక్స్ వైరస్ బారిన పడ్డారు. WHO ప్రకారం.. మంకీపాక్స్ వైరల్ వ్యాధి. స్మాల్ పాక్స్ కుటుంబానికి చెందినదిగా గుర్తించారు. మధ్య, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా ఈ వ్యాధి కనిపిస్తుంటుంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. మంకీపాక్స్ ఇన్‌ఫెక్షన్ సాధారణంగా 6 రోజుల నుంచి 13 రోజులు ఉంటుంది. మరికొంతమందిలో మాత్రం 5 రోజుల నుంచి 21 రోజుల వరకు ఉంటుంది.

ఆస్ట్రేలియా : 1-5 కేసులు
బెల్జియం : 1-5 అనుమానిత కేసులతో 1-5 కేసులు
కెనడా : 11-12 అనుమానిత కేసులతో 1-5 కేసులు
ఫ్రాన్స్ : 1-5 కేసులు, 1-5 అనుమానిత కేసులు
జర్మనీ : 1-5 కేసులు
ఇటలీ : 1-5 కేసులు
నెదర్లాండ్స్ : 1-5 కేసులు
పోర్చుగల్ : 21-30 కేసులు
స్పెయిన్ : 6-10 అనుమానిత కేసులతో 21-30 కేసులు
స్వీడన్ : 1-5 కేసులు
యునైటెడ్ కింగ్‌డమ్ : 21-30 కేసులు
యునైటెడ్ స్టేట్స్ : 1-5 కేసులు

వ్యాధిపై పోరాడేందుకు టీకాలను తయారుచేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రజలను రక్షించడానికి మశూచి వ్యాక్సిన్‌ను ఉపయోగించే అవకాశాన్ని కెనడియన్ ప్రభుత్వం అన్వేషిస్తోంది. అంతకుముందు.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మాట్లాడుతూ.. మంకీపాక్స్ వ్యాప్తిపై ప్రతి ఒక్కరూ ఆందోళన చెందాల్సిన విషయమన్నారు. అమెరికా ఆరోగ్య అధికారులు ఈ వ్యాధికి సాధ్యమయ్యే చికిత్సలు, వ్యాక్సిన్‌లను పరిశీలిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Read Also : 

ట్రెండింగ్ వార్తలు