Suicide Plant : తాకితే శపించే మొక్క..ఆకుల్ని టచ్ చేస్తే..మామూలుగా ఉండదు

ఆ మొక్కను ముట్టుకుంటే ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన మొక్కల్లో ఇదొకటి. ఆ మొక్క ఆకులు ముట్టుకుంటే..

MOst Dangerous Suicide Plant : పచ్చని మొక్కలు చూస్తే మనస్సుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు మనిషికి ఆక్సిజన్ ను ఇస్తాయి. అలా మనిషి ప్రాణాల్ని కాపాడే మొక్కలే కాదు ప్రాణం తీసే మొక్కలు కూడా ఉంటాయి. ఈ ప్రకృతి వింతల్లో ఇటువంటి మొక్కల్లో కూడా భాగంగా ఉన్నాయి. కొన్ని మొక్కలు మనిషి మనుగడకు కారణమైతే…. మరికొన్ని మొక్కలు కీటకాలను తింటాయి.. అయితే ఇంకొన్ని మొక్కలు ప్రాణాలను సైతం తీస్తాయనే విషయం తెలుసా? మొక్కల్లో అత్యంత ప్రమాదకరమైన మొక్కలు కూడా ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రమాదకారి మొక్క గురించి తెలుసుకుందాం. ఈ మొక్క ఆకుల్ని కనీసం తాకినా ప్రాణం పోయేంత నొప్పిగా ఉంటుందట. పొరపాటున తాకినా ఆ నొప్పి భరించటం అంటే మాటల కాదట. ఎంత నొప్పి అంటూ ఆ బాధ భరించేకంటే ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనేంత నొప్పి ఉంటుందట.

అందుకే ఈ మొక్కని ‘సూసైడ్ ప్లాంట్ ’అని కూడా అంటారు. ఈ మొక్క సైంటిఫిక్ పేరు డెండ్రోక్నైడ్ మొరాయిడెస్ (Dendrochnide moraides).మొక్కల్లో అత్యంత ప్రమాదకరమైన మొక్కల్లో ఒకటి గింపీ-గింపీ మొక్కలు. ఆస్ట్రేలియా దేశంలో ఎక్కువగా కనిపించే ఈ మొక్కల ఆకుల మీద ముళ్లలాంటివి ఉంటాయి. ఆకుని టచ్ చేశామా ఇక అంతే ఆ భయంకరమైన నొప్పి భరించే కంటే ఆత్మహత్య చేసుకోవడం బెటర్ అని అనిపిస్తుందట. అంటే ఆ నొప్పి ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

తాకితే చాలు శపించే మొక్క గింపీ గింపీ మొక్క..
గింపీ-గింపీ ముళ్ల మొక్క గిరించి తెలియక పూర్వం ‘‘ఈ మొక్కని తాకితే శపిస్తుంది అందుకే అంత భయంకరమైన నొప్పి కలుగుతుంది’’ అని గిరిజనలు అనుకునేవారట. అందుకే ఈ మొక్కను తాకితే శాపం పెడుతుంది అనే మాట ప్రాచుర్యం అయిపోయింది. ఈ మొక్క ఆకులు రావి ఆకుల షేపులో ఉంటాయి, ఆకులపై సన్నటి ముల్లు ఉంటాయి. ఇవి గుచ్చుకుంటే తేలు కుడితే ఎలాంటి నొప్పి కలుగుతుంటే..అంతకంటే పదింతలు నొప్పి ఉంటుంది. ఈ ముళ్ళు గుచ్చుకున్న తర్వాత రెండు గంటలపాటు ఆ నొప్పి ఉంటుంది. ఈ నొప్పి భరించే కంటే చావటం మేలనుకునే రేంజ్ లో ఉంటుంది నొప్పి.

ఈ ముళ్ళు పొరపాటున గుచ్చుకుని శరీరంలో ఉండిపోతే ఆ నొప్పి తగ్గనే తగ్గదు. ముళ్ళు శరీరం నుంచి తీసేసిన తరువాత రెండు గంటలపాటు నొప్పి ఉండటమే కాకుండా తరువాత తగ్గిన చాలా సంవత్సరాల పాటు నొప్పి పూర్తిగా తగ్గకుండా కొంచెం అయినా బాధ ఉంటుందట. అందుకే ఈ గింపీ గింపీ మొక్కని ప్రపంచంలోని భయంకరమైన మొక్కల్లో ఒకటి అని పరిశోధకులు చెబుతుంటారు.

ట్రెండింగ్ వార్తలు