Typhoon Ragasa
Typhoon Ragasa: 2025 సంవత్సరంలోనే అత్యంత శక్తివంతమైన తుఫాన్ ‘టైపూన్ రాగస’ ఫిలిప్పీన్స్ దేశాన్ని హడలెత్తిస్తోంది. ఉత్త పిలిప్పీన్స్‌ను విధ్వంసకర గాలులు, కుండపోత వర్షంతో ఈ తుఫాను తాకింది. ఫిలిప్పీన్స్‌లో నాండోగా పిలువబడే టైపూన్ రాగస తుఫాను సోమవారం ఉత్తర కాగయన్ ప్రావిన్సులోని పనుయిటన్ ద్వీపం వద్ద తీరాన్ని తాకిందని ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. గంటకు 267 కిలో మీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీచాయి. ఇది కేటగిరీ ఐదు హరికేన్ కు సమానం.
పిలిప్పీన్స్‌లోని ఉత్తర, మధ్య లుజోన్ అంతటా పదివేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిగిలిన ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ సోమవారం రాజధాని ప్రాంతమైన మెట్రో మనీలాలో, లుజోన్ ప్రాంతంలోని 29 ప్రావిన్సుల్లో ప్రభుత్వ కార్యక్రమాలను నిలిపివేశారు. ఉత్తర కాగయాన్ ప్రావిన్సులోని ఆస్పత్రులను అప్రమత్తం చేశారు. తుఫాను కారణంగా కాలయాన్ ద్వీపంలో, మొత్తం ఉత్తర అపయావో ప్రావిన్సులో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Heavy onshore swell fetch beginning to inundate the lower lying area on the east coast here in #Basco. Could see quite a significant storm surge event in the coming hours as Super #Typhoon continues to edge closer 🌀#RAGASA #Philippines @JordanHallWX pic.twitter.com/jOB5tYOx4b
— Jason H (AU) 🇦🇺 (@OreboundImages) September 21, 2025
ఈ భయంకరమైన తుఫాను హాంకాంగ్ , చైనా ప్రధాన భూభాగాన్ని తాకనుండటంతో ఈ ప్రాంతం అంతటా వందలాది విమానాలను రద్దు చేశారు. కెనడియన్ వాతావరణ సంస్థ ది వెదర్ నెట్‌వర్క్ ప్రకారం.. 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా సంభవించని అత్యంత శ్యక్తివంతమైన తుపాను ‘టైపూన్ రాగస’ అని పేర్కొంది.
🌀SCENE: Super #Typhoon #Ragasa slams #Philippines‘ #Cagayan province pic.twitter.com/Mdz4dE3meL
— ShanghaiEye🚀official (@ShanghaiEye) September 22, 2025
ఆసియా ద్వీప దేశంలోని కొన్ని ప్రాంతాలపై ఈ విధ్వంసకర తుఫాను ప్రభావం చూపనుంది. ముఖ్యంగా హాంకాంగ్, మకావు, చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లపై ఈ తుపాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాబోయే 36గంటల పాటు అన్ని ప్రయాణికుల విమానాలను రద్దు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
టైపూన్ రాగస దూసుకొస్తున్న నేపథ్యంలో చైనా వాతావరణ శాఖ తీవ్ర స్థాయి హెచ్చరికలు జారీ చేసింది. లెవల్ 2 ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ ఏడాది ఇదే అత్యంత శక్తిమైన టైపూన్ అని ఇప్పటికే చైనా వాతావరణ శాఖ తెలిపింది.
పిలిప్పీన్స్ రాజధాని మనీలాకు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఆ టైపూన్ కేంద్రీకృతమైందని చైనా వాతావరణ శాఖ చెప్పింది. బుధవారం నాటికి చైనా తీరాన్ని ఆ టైపూన్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం దక్షిణ చైనా సముద్రంలోకి ఆ టైఫూన్ ప్రవేశించనున్నది. సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు గువాంగ్‌డాంగ్, సెంట్రల్, సదరన్ గాంగ్జీ, సదరన్ ఫుజియన్, సదరన్ హునాన్, ఈస్ట్రన్ యునాన్, హైనన్ దీవిలో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సు ఉందని చైనా వాతావరణ శాఖ అంచనా వేసింది.
The wind is quite chaotic, due to surrounding hills. Periods of calm interrupted by strong gusts of wind as #super #typhoon #ragasa #nandoph passes south of Batan in Philippines pic.twitter.com/fYDwUfalUq
— James Reynolds (@EarthUncutTV) September 22, 2025