Ghost
Mysterious Figure: యునైటెడ్ స్టేట్స్‌లోని ఆ ఇంటి వెనుక భాగంలో కనిపించిన అర్థం కాని ఆకారం గురించి నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. పారానార్మాలిటీ మ్యాగజైన్ ఈ వీడియో పోస్ట్ చేయడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారానార్మల్ ఔత్సాహికులు ఇదేమై ఉంటుందనే ఆలోచనలో పడిపోయారు. మనిషిలాగే కనిపిస్తున్నప్పటికీ కాళ్ల కనిపించడం లేదు.
33 సెకన్ల పాటు ఉన్న వీడియోలో ఏదో ఒక రూపం మనిషి ఆకారానికి దగ్గరగా ఉంది. కాళ్లు లేకుండా ఒంగి నడుస్తున్నట్లుగా ముందుకు వెళ్తున్నట్లు కనిపించింది. ఆ ఇంటి యజమాని కారులోకి వెళ్లేముందు చుట్టూ చూసుకుని అందులోకి ప్రవేశించింది. వీడియోకు సంబంధించిన ఆడియోలో ఆ ఆకారపు మొహాన్ని కూడా చూశామని చెప్పుకోవడం వినొచ్చు.
జులై 9న మూర్‌హెడ్ సమీపంలోని సెక్యూరిటీ కెమెరాలో ఈ జీవి నడుస్తున్నట్లుగా రికార్డ్ అయింది. దీనికి ఐదు లక్షల మంది వ్యూర్స్ రాగా.. దీనిపై నెటిజన్లు బాగా పరిశీలించి గంటల తరబడి చర్చించుకుంటున్నారు. ఇది కల్పితమో.. అస్పష్టంగా ఉన్న ఆ రూపం వెనుక దెయ్యం లాంటిదేమైనా ఉందో ఆలోచించండి మరి.
Read Also: ఆదిలాబాద్ ఆశ్రమ పాఠశాలలో దెయ్యం…? వణికిపోతున్న బాలికలు
Here's the video of the Pale creature caught on a security cam near Moorhead, KY. #cryptid pic.twitter.com/jCexxlQTA0
— Paranormality Magazine (@ParanormalityM) July 9, 2022