Mystery Bidder : బెజోస్‌తో స్పేస్ ట్రిప్ అన్నాడు.. రూ. 206 కోట్లు కట్టేసి రాలేనంటున్నాడు!

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లాలని తెగ ఆరాటపడ్డాడు. స్పేస్‌లోకి వెళ్లేందుకు సీటు కూడా ఖరారు చేసుకున్నాడు. ఏకంగా 2.8 కోట్ల డాలర్లు (రూ.206 కోట్లు) ఖర్చు పెట్టి కొనుగోలు చేశాడో ప్యాసింజర్..

Mystery Bidder : అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తో కలిసి అంతరిక్షంలోకి వెళ్లాలని తెగ ఆరాటపడ్డాడు. స్పేస్‌లోకి వెళ్లేందుకు సీటు కూడా ఖరారు చేసుకున్నాడు. ఏకంగా 2.8 కోట్ల డాలర్లు (రూ.206 కోట్లు) ఖర్చు పెట్టి కొనుగోలు చేశాడో ప్యాసింజర్.. అంతరిక్షంలోకి వెళ్లే సమయం దగ్గరపడ్డాక నేను బిజీ రావడం కుదరదంటున్నాడు. ఫ్యూచర్ లో ఎప్పుడైనా చూద్దాంలే అంటూ తాపీగా చెప్పాడట. ఈ నెల 20న‌ పంప‌బోయే బ్లూ ఆరిజిన్ పంపే రాకెట్‌లో జెఫ్ బెజోస్ అంత‌రిక్షంలోకి వెళ్ల‌నున్నారు.

వ‌ర్జిన్ గెలాక్టిక్ ఫౌండ‌ర్ రిచ‌ర్డ్ బ్రాన్స‌న్ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. అంతరిక్షంలోకి వెళ్లడమంటే అదో అద్భుతమైన అవకాశం.. కోట్లు పోసి వేలంలో టికెట్‌ కొన్నాడు. ఇప్పుడా ప్యాసింజర్ తాను బిజీ చెప్ప‌డంతో బ్లూ ఆరిజిన్ మ‌రో వ్య‌క్తిని ఎంపిక చేసింది. వ్య‌క్తి పేరు ఒలివ‌ర్ డేమెన్‌. వయస్సు కేవ‌లం 18 ఏళ్లు మాత్ర‌మే. అంతరిక్షంలోకి వెళ్ల‌నున్న అత్యంత పిన్న వ‌య‌సు వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశాడు. బెజోస్‌తో మ‌రో వ్య‌క్తి 82 ఏళ్ల వాలీ ఫంక్ కూడా ఈ అంత‌రిక్షంలోకి వెళ్ల‌నున్నారు.

స్పేస్‌లోకి వెళ్తున్న అత్యంత పెద్ద వయస్సు వ్య‌క్తిగా రికార్డు సృష్టించ‌నున్నారు. ఈ ట్రిప్‌లో బెజోస్ సోద‌రుడు మార్క్ కూడా ఉండ‌నున్నారు. న్యూ షెప‌ర్డ్ తొలి హ్యూమ‌న్ అంతరిక్ష విమానం.. భార‌త కాల‌మానం ప్ర‌కారం.. ఈ నెల 20న ఉద‌యం 5 గంట‌ల‌కు నింగిలోకి ఎగ‌ర‌నుంది. ఈ లాంచ్‌ను BlueOrigin.com వెబ్‌సైట్‌లో లైవ్ బ్రాడ్‌కాస్ట్ చేయ‌నున్నారు.

ట్రెండింగ్ వార్తలు