Kim Yo-jong : దక్షిణకొరియా అధ్యక్షుడిని నోరు మూసుకోమన్న కిమ్ సోదరి

దక్షిణకొరియా అధ్యక్షుడుయూన్‌ సుక్‌ యేల్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు ఉత్తరకొరియా అధ్యక్షు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్. దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యేల్‌ నోరుమూసుకోవాలి అంటూ హెచ్చరించారు కిమ్ సోదరి యో జోంగ్.

Kim Yo-jong slams South’s offer of aid for denuclearisation : దక్షిణకొరియా అధ్యక్షుడుయూన్‌ సుక్‌ యేల్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు ఉత్తరకొరియా అధ్యక్షు కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్. ఓ దేశానికి అధ్యక్షుడు అని కూడా ఆలోచించకుండా దక్షిణకొరియా అధ్యక్షుడుపై నోరు పారేసుకున్నారు కిమ్ సోదరి కిమ్ యో జోంగ్. దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యేల్‌ నోరుమూసుకోవాలి అంటూ హెచ్చరించారు కిమ్ సోదరి యో జోంగ్.

అణ్వాయుధాలను వదులుకొంటే ఆర్థిక సాయం చేస్తామంటూ ఆఫర్‌ ప్రకటించిన దక్షిణ కొరియాపై యో జోంగ్‌ శుక్రవారం (19,2022)ఘాటుగా స్పందించారు. అసంబద్ధతకు నిలువెత్తు నిదర్శనం దక్షిణకొరియా ఆఫర్‌ అని అభివర్ణించారు. కేవలం తిండి కోసం (మొక్కజొన్న కంకుల కోసం) ఎవరూ వారి లక్ష్యాలను వదలుకోరు అంటూ మండిపడ్డారు. ‘దక్షిణకొరియా అధినేత యూన్‌ సుక్‌ యేల్‌ కాస్త నోరుమూసుకోవాలి‘ అంటూ హెచ్చరించారు. యూన్‌ సుక్‌ యేల్‌వి అమాయక చర్యలని..యూన్ వి పిల్లచేష్టలు అంటూ వ్యాఖ్యానించారు యో జోంగ్.

కిమ్ యో జోంగ్‌ చేసిన కఠిన వ్యాఖ్యలపై దక్షిణికొరియా అధ్యక్ష కార్యాలయం కూడా కాస్త వెటకారంగానే స్పందించింది. కిమ్‌ సోదరి కామెంట్లు విచారకరం అంటూనే మా ఆఫర్‌ ఇప్పటికీ అందుబాటులో ఉంది వాడుకుంటే అంటూ ఎద్దేవా చేసింది. దక్షిణ కొరియా శాంతి కోసం సాహసోపేతమైన ఆఫర్‌ ను రెడీ చేస్తోందని..గత మే నెలలో ప్రకటిస్తూ..ఈ ఆఫర్ ఉత్తరకొరియా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటంతో పాటు జీవన ప్రమాణాలను కూడా పెంచుతుంది అని అధ్యక్షుడు యూన్‌ పేర్కొన్నారు.

కాగా..యూన్‌ దక్షిణ కొరియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి 100 రోజులు పూర్తిఅయ్యాయి. ఈ సందర్భంగా యూన్ మాట్లాడుతూ.. దశల వారీగా ఉత్తరకొరియాకు ఆర్థిక సాయం చేసేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. దీనికి ప్రతిస్పందనగా కిమ్‌ సోదరి యూన్ చేసిన ప్రకటనపై తనదైన శైలిలో ఘాటుగా స్పందిస్తూ..యూన్ నోరుమూసుకోవాలి అని వ్యాఖ్యానించారు. తమకు ఆ ప్లాన్‌ ఏమిటో తెలియదని.. అసలు అటువంటి వాటితో డీల్‌ ఎప్పుడూ చేయమని తేల్చి చెప్పారు.

 

ట్రెండింగ్ వార్తలు