భారత సాంప్రదాయమే ముద్దు : ‌‘నమస్తే’తో ఫ్రాన్స్, జర్మనీ దేశాగ్రనేతల పలకరింపు

కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరి జీవితాల్లో చాలా మార్పులు తీసుకొస్తోంది. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాల్సిన అవసరాన్ని వైద్య నిపుణుల నొక్కి చెబుతున్నారు. ఆలింగనలు, షేక్ హ్యాండ్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో భౌతిక దూరంతో కూడిన భారత సాంప్రదాయ ‘నమస్తే’ పలకరింపు ప్రపంచ వ్యాప్తంగా ప్రచుర్యం పొందుతోంది.



షేక్ హ్యాండ్‌తో పలకరించుకోవడం కంటే…భౌతిక దూరం పాటిస్తూ భారత సాంప్రదాయంలో ‘నమస్తే’తో పలకరించుకునేందుకే ఇప్పుడు ప్రపంచ నేతలు కూడా మొగ్గుచూపుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ట్రావెల్ ఆంక్షలపై చర్చించేందుకు గురువారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ సమావేశమయ్యారు.



ఈ ఇద్దరు ఐరోపా అగ్రనేతలు షేక్ మ్యాండ్‌కు బదులుగా ఇండియన్ స్టయిల్‌లో నమస్తేతో పలకరించుకున్నారు. భౌతిక దూరం పాటిస్తూ…నమస్తే అంటూ పరస్పరం గ్రీట్ చేసుకున్నారు. రెండు చేతులు జోడించి నమస్తేతో ఏంజెలా మెర్కల్‌కు మాక్రన్ స్వాగతం పలకగా…ఆమె కూడా నమస్తే చెబుతూ ఆయనకు ప్రతినమస్కారం చేశారు. నమస్తే ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి చెందుతోందంటూ దీనికి సంబంధించిన వీడియోను ఆల్ ఇండియా రేడియో ట్వీట్ చేసింది.


ట్రెండింగ్ వార్తలు