అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఊహించని పరిస్థితి ఎదురైంది. తాను ఇచ్చిన ప్రసంగం పేపర్లను స్పీకర్ చించేశారు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికంతటికీ కారణం షేక్ హ్యాండ్ ఇవ్వనందుకే అని తెలుస్తోంది. ట్రంప్ పై అభిశంసనకు సెనేట్ లో చర్యలు చేపట్టింది స్పీకర్ నాన్సీనే కాబట్టి..ట్రంప్ ఆమెతో చేతులు కలిపేందుకు నిరాకరించినట్లు..అర్థమౌతోందనే టాక్ వినిపిస్తోంది.
ట్రంప్ ప్రస్తుతం అభిశంసనను ఎదుర్కొంటున్నారు. స్పీకర్ నాన్సీ..ట్రంప్ మధ్య విబేధాలున్నాయి. గత అక్టోబర్ నుంచి ట్రంప్..నాన్సీ మధ్య మాటలు లేవు. ఉభయసభలు జరుగుతున్నా..వీరి మధ్య ఎలాంటి పలకరింపులు లేవు. తాజాగా ట్రంప్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగానికి కంటే ముందు..ట్రంప్ తనదగ్గరున్న ప్రసంగ ప్రతులను స్పీకర్ నాన్సీకి ఇచ్చారు. ప్రసంగం చేసే వేదిక వెనుక స్పీకర్ నాన్సీ కూర్చొన్నారు.
Read More : కాసేపట్లో పెళ్లి..UPలో ఘోరం
ప్రసంగ పాఠాన్ని అందుకున్న అనంతరం ట్రంప్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నాన్సీ ప్రయత్నించారు. కానీ ట్రంప్ మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా..వెనుకకు తిరిగి ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో స్సీకర్ నాన్సీ ఆగ్రహానికి గురయ్యారు. చివరిలో ప్రసంగ కాపీనీ రెండు ముక్కలు చేశారు. చేతులు కలిపేందుకు నిరాకరించడం కారణంగానే స్పీకర్ ఈ విధంగా చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Pelosi rips up copy of Trump’s speech right after he finished. https://t.co/lLZGiDXI0r#SOTU pic.twitter.com/JixDBwLYeG
— Dan Linden (@DanLinden) February 5, 2020