Manned Landing Sites On Moon : చంద్రుడిపై మనుషులు దిగే 13 ప్రాంతాలు గుర్తింపు

భవిష్యత్తులో చంద్రుడిపైకి మనుషులను పంపితే ఎక్కడ ల్యాండవ్వాలనేది కూడా సమస్యగానే మారింది. దీనికి నాసా తాజాగా సమాధానం చెప్పింది. దీనికోసం చందమామపై మొత్తం 13 ప్రాంతాలను గుర్తించింది. త్వరలోనే ఆర్టిమిస్-3 మిషన్ ద్వారా మరోసారి మనుషులను చంద్రుడిపైకి పంపే యోచనలో నాసా ఉంది.

Manned Landing Sites On Moon : చంద్రుడిపై మానవులు అడుగు పెట్టించాలన్నదే అంతరిక్ష పరిశోధనల్లో అన్నిదేశాల కల. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా… ఈ మిషన్‌ను విజయవంతంగా ముగించిన తర్వాత.. చాలా దేశాలు మానవులను చంద్రుడిపై సొంతంగా పంపేందుకు ప్రయత్నాలు చేస్తూనేవున్నాయి. ఇందుకోసం ముందుగా మానవ రహిత స్పేస్ క్రాఫ్ట్‌లను పంపుతున్నాయి.

భవిష్యత్తులో చంద్రుడిపైకి మనుషులను పంపితే ఎక్కడ ల్యాండవ్వాలనేది కూడా సమస్యగానే మారింది. దీనికి నాసా తాజాగా సమాధానం చెప్పింది. దీనికోసం చందమామపై మొత్తం 13 ప్రాంతాలను గుర్తించింది. త్వరలోనే ఆర్టిమిస్-3 మిషన్ ద్వారా మరోసారి మనుషులను చంద్రుడిపైకి పంపే యోచనలో నాసా ఉంది.

New Moon : మన సౌర కుటుంబం పక్కనే మరో చంద్రుడు..భూమికంటే మూడు రెట్లు పెద్దగా

ఈ నేపథ్యంలోనే ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను ల్యాండ్ చేసేందుకు చందమామ దక్షిణ ధ్రువం సమీపంలో 13 ప్రాంతాలను గుర్తించింది. చంద్రుడిపై ఆర్టిమిస్ నౌక ఆరున్నర రోజులు ఉంటుంది. ఈ సమయం మొత్తం పగలు ఉండేలా ఈ ప్రాంతాలను గుర్తించారు. ప్రతి నిమిషం సూర్యకాంతి ఉండే ప్రాంతాలను నాసా గుర్తించింది.

ట్రెండింగ్ వార్తలు