NASA Mars Helicopter : అంగారకుడిపై ఎగిరిన నాసా హెలికాప్టర్..

అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ నాసా ప్లాన్ సక్సెస్ అయింది. అంగారకునిపై నాసా హెలికాఫ్టర్‌ విజయవంతంగా ఎగిరింది. సౌర కుటుంబంలో మార్స్ గ్ర‌హంపై తొలిసారి హెలికాప్ట‌ర్‌ ఎగిరింది. నాసా సోమ‌వారం ఒక ప్రకటనలో వెల్ల‌డించింది.

NASA Mars Helicopter : అమెరికా అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ నాసా ప్లాన్ సక్సెస్ అయింది. అంగారకునిపై నాసా హెలికాఫ్టర్‌ విజయవంతంగా ఎగిరింది. సౌర కుటుంబంలో మార్స్ గ్ర‌హంపై తొలిసారి హెలికాప్ట‌ర్‌ ఎగిరింది. నాసా సోమ‌వారం ఒక ప్రకటనలో వెల్ల‌డించింది. ప‌ర్సీవ‌రెన్స్ రోవ‌ర్‌తో క‌లిసి మార్స్‌పైకి వెళ్లిన ఇన్‌జెన్యూయిటీ హెలికాప్ట‌ర్ తొలిసారి మార్స్‌పై ఎగిరిన‌ట్లు నాసా ట్వీట్ ద్వారా పేర్కొంది. అంగారకుడిపై ఉపరితలంపై నాసా హెలికాప్టర్ ఎగిరిన అద్భుత దృశ్యాన్ని నాసా రికార్డు చేసింది.

దానికి సంబంధించిన వీడియోను నాసా ట్వీట్ చేసింది. నాసా ప్రయోగించిన మార్స్ హెలికాప్టర్ కొంతదూరం గాల్లోకి ఎగిరి మళ్లీ విజయవంతంగా ఉపరితలంపై ల్యాండ్ అయింది. ఇన్‌జెన్యూయిటీ తొలిసారి ఎగిరిన త‌ర్వాత దాని నుంచి డేటాను మార్స్ హెలికాప్ట‌ర్ టీమ్ అందుకుంది. ఎగిరిన హెలికాప్టర్ లోని రోటార్ మోటార్లు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని సరిగానే పనిచేస్తున్నాయని నాసా వెల్లడించింది. ప్రస్తుతం మార్స్ ఉపరితలంపై తీవ్రమైన శీతాకాల పరిస్థితులు ఉన్నాయని, చారిత్రక హెలికాఫ్టర్‌ను ఎగిరేలా చేస్తామన్ని నాసా ప్రకటించింది. మార్స్‌పై ఉపరితలం చాలా కఠినంగా ఉందని నాసా ప్రకటించింది.


రోవర్‌ సహాయంతో మార్స్‌పై అన్ని ప్రాంతాలను స్పష్టంగా చూసేందుకు వీలు లేదని తెలిపింది. అరుణ గ్రహంపై హెలికాప్టర్‌ ఎగరడం ఇదే మొదటిసారి. వాస్తవానికి ఈ హెలికాప్టర్‌ ఎగిరే కార్యక్రమం ఏప్రిల్ 11న జరగాల్సి ఉంది.

పలు సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు హెలికాప్టర్‌ ఎగిరే కార్యక్రమాన్ని తమ వెబ్‌సైట్‌ ద్వారా లైవ్ టెలిక్యాస్ట్ చేసింది నాసా. హెలికాప్టర్‌ను పర్యవేక్షించే బృందం సాఫ్ట్‌వేర్‌ను అప్ డేట్ చేసింది. మూడు రోజుల క్రితం నిర్వహించిన టెస్టులో హెలికాప్టర్ స్పిన్ సక్సెస్‌ అయింది. డాటా అందుకున్న తర్వాత నాసా వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు