NASA Asteroid
NASA Asteroid : అత్యంత భారీ గ్రహశకలం భూమివైపుగా దూసుకొస్తోంది. దాదాపు 390 అడుగుల (119 మీటర్లు) వెడల్పు కలిగిన ఈ గ్రహశకలం కుతుబ్ మినార్ అంత పరిమాణంలో ఉంటుంది. దీన్ని అపోలో-క్లాస్ ఆస్టరాయిడ్ 2011 VG9 అనే పేరుతో పిలుస్తారు. ఏప్రిల్ 16న అత్యంత వేగంతో భూమిని సమీపిస్తోంది.
Read Also : Gold Prices : బంగారం కొనేవారికి బిగ్ షాక్.. తులం రూ.1.25 లక్షలకు చేరనున్న పసిడి.. త్వరగా కొనేసుకోండి..!
భూమికి సమీపంగా వస్తున్న ఈ గ్రహశకలంతో ముప్పుపై నాసా హెచ్చరిస్తోంది. ప్రస్తుతానికి ఈ గ్రహశకలంతో మన గ్రహానికి ఎలాంటి ముప్పు లేనప్పటికీ దాని పరిమాణం, వేగం ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఒకవేళ ఈ గ్రహశకలం భూమిని తాకితే వినాశకరమైన శక్తిని విడుదలవుతుందని, దాంతో భారీ విధ్వంసం సంభవించవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ గ్రహశకలం అపోలో తరగతి గ్రహశకలాలకు చెందినది. గంటకు 85,520 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఏప్రిల్ 16న సాయంత్రం 5:54 IST (12:24 UTC)కి భూమిని దాటి వెళ్లనుంది. భూమికి సమీప దూరం 4.6 మిలియన్ కిలోమీటర్లు అయినప్పటికీ, శాస్త్రవేత్తలు ముప్పుపై ఆందోళన వ్యక్తం చేశారు.
అపోలో గ్రహశకలాలు ఏంటి? :
అపోలో ఆస్టరాయిడ్స్ అనేవి భూమికి దగ్గరగా ఉండే వస్తువుల (NEOs) కేటగిరీకి చెందినవి. భూమి మార్గాన్ని దాటే కక్ష్యల్లో తిరుగుతుంటాయి. ఈ ఆస్టరాయిడ్స్ మన గ్రహం దగ్గరకు వచ్చి వెళ్తుంటాయి. దీని కారణంగా ఖగోళ సైంటిస్టులు నిశితంగా వీటి గమనాన్ని పరిశీలిస్తుంటారు. అన్ని అపోలో ఆస్టరాయిడ్‌లతో ముప్పు లేనప్పటికీ, వాటి గమనాల్లో మార్పులతో అంతరిక్షంలో ఏదైనా జరగొచ్చు. కొన్నిసార్లు ఇతర సమీప గ్రహాలపై దూసుకురావొచ్చు. ఒకవేళ ఇలా జరిగితే వినాశనం తప్పదు.
భూమిని 2011 VG9 ఢీకొంటే ఏం జరుగుతుంది? :
2011 VG9 భూమిని సురక్షితంగా దాటుతుందని భావిస్తున్నప్పటికీ.. ఇంత పెద్ద పరిమాణంలో ఉన్న గ్రహశకలం గ్రహాన్ని ఢీకొంటే.. భారీ వినాశనమే కలుగుతుంది. 390 అడుగుల వెడల్పు కలిగిన ఈ గ్రహశకలం భూమిని ఢీకొంటే.. ఒక నగరం మొత్తాన్ని విధ్వంసం చేస్తుంది. గంటకు 85వేల కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించే ఈ గ్రహశకలం పదుల మెగాటన్ల TNTకి సమానమైన శక్తిని విడుదల చేస్తుంది.
ఈ భారీ బిలం అగ్ని తుఫానులు, భారీ విధ్వంసాన్ని సృష్టిస్తుంది. 2013లో చెల్యాబిన్స్క్ గ్రహశకలం 60 అడుగుల కన్నా తక్కువ వెడల్పుతో విధ్వంసం సృష్టించింది. ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టడంతో రష్యాలో 1,500 మందికి పైగా గాయపడ్డారు. ఈ గ్రహశకలం కన్నా ఇప్పుడు 6 రెట్లు పరిమాణంతో ఉంటుంది 2011 VG9 గ్రహశకలం.
గ్రహశకలాల గమనంపై ట్రాకింగ్ :
నాసా సెంటర్ ఫర్ నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ (CNEOS), గ్లోబల్ అబ్జర్వేటరీలు, రాడార్ వ్యవస్థలతో 2011 VG9 లాంటి గ్రహశకలాలను నిరంతరం ట్రాక్ చేస్తోంది. ఒకవేళ గ్రహశకలాల గమనాన్ని ఆలస్యంగా గుర్తిస్తే జరగాల్సిన నష్టం భారీగా ఉంటుంది.
Read Also : Honda Dio 125 : కొత్త స్కూటర్ కొంటున్నారా? హోండా డియో 125 స్కూటర్ భలే ఉందిగా.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?
చాలావరకూ గ్రహశకల ట్రాకింగ్ డేటా అనేది పాన్-స్టార్స్, కాటాలినా స్కై సర్వే, ఎన్ఈఓ సర్వేయర్ వంటి అధిక శక్తితో కూడిన టెలిస్కోప్‌లతో ట్రాకింగ్ చేస్తుంటారు. ప్రస్తుతానికి 2011 VG9 గ్రహశకలం భూమిని ఢీకొట్టే పరిస్థితి లేదు. కొన్నిసార్లు గ్రహశకలాల కక్ష్య మార్పుతో పెను విపత్తుకు దారితీయొచ్చు.