New Sun : సూర్యుడి లాంటి కొత్త నక్షత్రం.. భూమికి వెయ్యి కాంతి సంవత్సరాల దూరంలో బేబి సూర్యుడు

ప్రస్తుతం నక్షత్రం ఇప్పటికీ ఏర్పడే తొలి దశలోనే ఉందని.. కాంతి సూపర్ సోనిక్ వేగంతో చీలిపోతున్న దృశ్యాన్ని బంధించింది. దీంతో నక్షత్రాలు ఏర్పడే ప్రక్రియ, అలాగే సూర్యుడి గురించి తెలుసుకోవచ్చని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

New Sun Like Star : అంతరిక్షం, విశ్వంలో ఎన్నో వింతలు, విశేషాలు, రహస్యాలు దాగి ఉన్నాయి. విశ్వం, గ్రహాల ఆవిర్భావం వంటి రహస్యాలను ఛేదించేందుకు శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శాస్త్రవేత్తలకు జేమ్స్ వెబ్ టెలిస్కాప్ ెంతో సహాయ పడుతోంది. ఇప్పటికే ఖగోళానికి చెందిన ఎన్నో ఫొటోలను తీసి పంపిన ఈ భారీ టెలిస్కోప్ తాజాగా మరో అద్భుతమైన చిత్రాన్ని తీసింది. సూర్యుడి లాంటి కొత్త నక్షత్రం ఫొటోను తీసి పంపింది.

భూమికి వెయ్యి కాంతి సంవత్సరాల దూరంలో సూర్యుడి వంటి కొత్తగా నక్షత్రం ఏర్పడుతున్న ఫొటోను తీసి భూమిపైకి పంపించింది. ఇది మన సూర్యుడు పుట్టిన సమయంలో ఎలా ఉండేదో తెలుపుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం నక్షత్రం ఇప్పటికీ ఏర్పడే తొలి దశలోనే ఉందని.. కాంతి సూపర్ సోనిక్ వేగంతో చీలిపోతున్న దృశ్యాన్ని బంధించింది. దీంతో నక్షత్రాలు ఏర్పడే ప్రక్రియ, అలాగే సూర్యుడి గురించి తెలుసుకోవచ్చని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Moon Moving Away From Earth : భూమికి దూరమవుతున్న చంద్రుడు.. 60 వేల కి.మీ దూరం జరిగిపోయిన మూన్

ఫొటోను ట్విట్టర్ లో నాసా పోస్ట్ చేసింది. కొత్తగా ఏర్పడే నక్షత్రం చుట్టూ కనపించే కాంతిని హెర్బీస్ హాలో అంటారని, ఈ నక్షత్రం భూమికి వెయ్యి కాంతి సంవత్సరాల దూరంలో ఉందని తెలిపింది. మన సూర్యుడు పుట్టిన సమయంలో చిత్రాన్ని తీయగలిగితే అది ఇలాగే ఉండేందని అమెరికన్ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఈ ఫొటోలో కొత్తగా పుట్టిన నక్షత్రం కనిపిస్తుండగా దాని నుంచి పోల్ గ్యాస్ సూపర్ సోనిక్ వేగంతో దూరంగా విసిరివేస్తున్నట్లుగా ఉంది.

Sun Rise in Night: ఆ ఒక్క దేశంలో రాత్రిపూట సూర్యుడు ఉదయిస్తాడు.. కారణమేంటి? ఇంతకీ ఆ దేశం పేరేంటో తెలుసా?

ఈ నక్షత్రానికి ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల వయసు మాత్రమే ఉంటుందని..కాలం గడిచే కొద్ది సూర్యడిలా మారుతుందని తెలిపింది.  ఈ నక్షత్రం నుంచి రెండు వైపులా దూసుకెళ్లిన గ్యాస్ చుట్టూ ఉండే వాయువులు, ధూళితో ఢీకొని హెర్బీస్ హాలోగా ఏర్పడుతుందని నాసా వెల్లడించింది.

ఈ నక్షత్రం బరువు మన సూర్యుడి బరువులో 8 శాతం మాత్రమే ఉంటుందని.. క్రమంగా సూర్యుడి ఆకృతిలో మారుతుందని పేర్కొంది. ఇదిలా ఉండగా నాసా 2021 సంవత్సరంలో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ను నింగిలోకి పంపింది. 2022 సంవత్సరంలో ఈ టెలిస్కోప్ తన పనిని ప్రారంభించింది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇప్పటికే ఎన్నో గెలాక్సీలకు సంబంధించిన చిత్రాలను తీసి భూమిపైకి పంపింది.

ట్రెండింగ్ వార్తలు